శృంగార సన్నివేశాలు అతనితో బాగా ఎంజాయ్ చేస్తా - తమన్నా
హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి.రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా..అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు.
విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. ఇదిలా ఉంటే తమన్నా తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తమన్నా గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీ-2లో బోల్డ్‌గా నటించి అందరికి షాకిచ్చింది. లస్ట్ స్టోరీ -2 వెబ్ సిరీస్‌లో ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. తాజాగా దీనిపై తమన్నా స్పందించారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..లస్ట్ స్టోరీ మొదటి పార్ట్ చూసిన తర్వాత శృంగారం సన్నివేశాలపై తన అభిప్రాయమే మారిపోయింది. బోల్డ్‌గా కనిపిస్తే తప్పేంటని తనకు తానే ప్రశ్నించుకున్నానని ఆమె తెలిపారు. దీని కారణంగానే లస్ట్ స్టోరీ -2లో నటించానని ఈ భామ చెప్పుకొచ్చారు.
అభిమానులు కూడా ఇలాంటివే చూస్తున్నారంటూ తమన్నా వెల్లడించారు. అలాగే ఇలాంటి సిరీస్‌లు.. సీన్లు చూసేందుకు సిగ్గు పడే ధోరణి నుంచి కాలంతో పాటు అందరూ మారే స్టేజ్‌కి వచ్చారని తమన్నా చెప్పారు. తనను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే తనను తాను ప్రజెంట్ చేసుకోవడం కూడా నటిగా నాకు అవసరమే అని తమన్నా చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఇప్పటి వరకు తాను బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు కానీ ఇవి కూడా పార్ట్ ఆఫ్ స్టోరీ మూవీ అని పేర్కొన్నారు. శృంగార సన్నివేశాలు కూడా సాధారణ సీన్స్ లాంటివే అని లేట్‌గా తెలుసుకున్నా అన్నారు. అండ్ దానికతోడు 'లస్ట్ స్టోరీస్ 2'లో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేసేటప్పుడు తనకు భయం, టెన్షన్ లేదు. ఎందుకంటే తన లవర్ విజయ్ వర్మ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కాస్త సిగ్గుపడుతూ చెప్పారు తమన్నా. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications