రోజా భర్త సెల్వమణికి షాకిచ్చిన నిర్మాతల సంఘం!
ఏపీ మాజీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణికి తమిళ నిర్మాతల సంఘం షాకిచ్చింది. దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెప్సీ)పై పలు ఆంక్షలు విధించడంతో తమకు మద్దతుగా నిలిచిన కార్మికులతో కొత్త యూనియన్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. కాగా, పెఫ్సీ అధ్యక్షుడిగా ఆర్కే సెల్వమణి ఉన్నారు.
గత కొంత కాలంగా తమిళ నిర్మాతల మండలి వర్సెస్ దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సభ్యులు కొంత కాలంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.

నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని ఆర్కే సెల్వమణిపై నిర్మాతల సభ్యులు మండిపడుతున్నారు. మరోవైపు, కొందరు నిర్మాతలే తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ సెల్వమణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హీరో ధనుష్, ఓ నిర్మాణ సంస్థ వివాదంపై సరైన విధంగా సెల్వమణి స్పందించలేదనే ఆరోపణలున్నాయి.
రోజా జైలుకెళ్లడం ఖాయమేనా?
అధికారాన్ని అడ్డంపెట్టుకుని పేద క్రీడాకారుల డబ్బులను మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అప్పనంగా నొక్కేశారని శాప్ ఛైర్మన్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. నిరుపేద క్రీడాకారులకు చెందిన రూ. కోట్లను రోజా దోచేశారని ఆరోపించారు.
రోజా అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, త్వరలో రోజా జైలుకు వెళ్లడం ఖాయమని రవినాయుడు వ్యాఖ్యానించారు. రోజాను అరెస్టు చేయడానికి దుమ్ము అవసరం లేదని చెన్నైలో ఉండే రోజాకు ఇక్కడి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications