ఆ స్టార్ హీరో దివాలా తీయబోతున్నారా.. నటుడుపై హైకోర్టు సీరియస్ !!
తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే ఆయనకు నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల్లో లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన భారీ అప్పు కూడా ఉండగా.. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. లేటెస్ట్ గా ఈ కేసులో కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. లైకా నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన డబ్బులను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.
కానీ ఈ క్రమంలోనే హీరో విశాల్ దివాలా తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విశాల్‌కు మరో షాక్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నుంచి తీసుకున్న అప్పును చెల్లించకపోవడంతో పాటు.. తన సినిమాల హక్కులను అగ్రిమెంట్‌కు వ్యతిరేకంగా ఇవ్వకపోవడంతో విశాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ విషయమై తీవ్రంగా ఆగ్రహించిన లైకా సంస్థ, విశాల్ చర్యలకు కోర్టు ద్వారా సమాధానం చెప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ విషయంపై కొన్ని వారాల క్రితం విచారణ ప్రారంభమవ్వగా.. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు తుది తీర్పునిచ్చింది. వీలైనంత త్వరగా లైకా ప్రొడక్షన్స్‌కు డబ్బులు చెల్లించాలని ఆదేశిస్తూ హీరో విశాల్‌కు నోటీసులు పంపింది. విశాల్ తరపున హాజరైన న్యాయవాదులు తమ క్లయింట్ ధనవంతుడు కాదని కోర్టుకు తెలపగా.. విశాల్ దివాలా తీసినట్లు ప్రకటించడానికి సిద్ధమా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కాగా విశాల్ దివాలా తీసినట్లు ప్రకటిస్తే ఆయన నిర్మాణ సంస్థ మూసివేయాల్సి వస్తుంది. అంతే కాకుండా డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై విశాల్ స్పందిస్తే ఎలా రియాక్ట్ అవుతారని చర్చ జరుగుతోంది.

మరోవైపు నటి సాయి ధన్షికతో కొన్ని నెలల ప్రేమాయణం నడిపిన విశాల్.. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంతా భావించారు. అయితే ఇప్పుడు విశాల్ వివాదంలో చిక్కుకోవడంతో ఈ పెళ్లి కూడా ఆగిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications