'తండేల్'పై ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?
తెలుగు రాష్ట్రాల్లో తండేల్ వైబ్ స్టార్ట్ అయింది. థియేటర్లకు ప్రేక్షకులు బారులు తీస్తున్నారు. ముఖ్యంగా యువత, లవర్స్ ను ఈ మూవీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈ సినిమాకు ప్రాణం పెట్టారు. ఆయన కష్టం స్క్రీన్ పై కనపడుతోంది. డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవితో పోటీ పడి చైతూ తన మార్క్ యాక్టింగ్ ఇరగదీశారు. దీంతో ఈ మూవీ ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాను సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు 'తండేల్'పై ఆసక్తికర విషయాలను చెప్పారు. తండేల్ సినిమా చూసిన అనంతరం తనకు కలిగిన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు.
'చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపథ్యం సాహసోపేతమే. మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయం అందుకున్న గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా!' అని రాఘవేంద్రరావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనిపై చైతూ రియాక్ట్ అయ్యారు. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు థ్యాంక్స్ చెప్పారు." మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం" అని రిప్లై ఇచ్చారు.

Thank you to the legendary director @Ragavendraraoba Garu for his wonderful praise for #BlockbusterThandel ❤️🔥
— Geetha Arts (@GeethaArts) February 8, 2025
Book your tickets for DHULLAKOTTESE BLOCKBUSTER #Thandel now!
🎟️ https://t.co/xtodRI8wA2#BlockbusterLoveTsunami
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92… pic.twitter.com/KCs1yxKx1O
ఇక ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7 న విడుదలైన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. 'తండేల్' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. చైతూ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాక ఫిబ్రవరిలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇంత భారీ ఓపెనింగ్ మరే ఏ సినిమా సాధించలేదట. తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications