లిప్‌లాక్‌తో లవ్‌ను కన్‌ఫాం చేసిన యంగ్ బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమాలో నయనతార సోదరిగా నటించిన యంగ్ తమిళ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుత ఈ అందాల భామ అడపాదడపా చిత్రాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. తన అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తూ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్‌తో నిశ్చితార్థం(Engagement) చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో "ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ కలిసే" అని రాస్తూ ప్రియుడు అయిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్‌ను లిప్‌లాక్ చేస్తున్నఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా "#SoonToBeMarried" అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడం ద్వారా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారి వివాహ తేదీ, వేదిక, ఇతర వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. తాన్యా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారగా.. ఈ జంటకు నెటిజన్లు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.
వెలుగులోకి ప్రేమబంధం
సిద్ధి ఇద్నాని,శివాత్మిక వంటి పలువురు సినీ ప్రముఖులు తాన్యాకు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ జార్జ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇదే విధమైన పోస్ట్‌ను పంచుకున్నారు. తాన్యా, గౌతమ్ తమ ప్రేమను నిన్నటి వరకు రహస్యంగా ఉంచారు. అయితే వారి పాత సోషల్ మీడియా పోస్టులు, స్నేహితులు, సినీ ప్రముఖుల అభినందనలను బట్టి చూస్తే, వారు కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

గౌతమ్ జార్జ్ ప్రాజెక్టులు
గౌతమ్ జార్జ్ గతంలో 'అన్నాబెల్ సేతుపతి', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాఘవ లారెన్స్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బెంజ్' చిత్రానికి పనిచేస్తున్నారు. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజ్ సొంత నిర్మాణ సంస్థ అయి 'G స్క్వాడ్', సుధన్ సుందరంకు చెందిన 'ప్యాషన్ స్టూడియోస్" జగదీష్ పళనిసామికి చెందిన "ది రూట్" నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం "లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)"లో భాగం కానుంది.
తాన్య రవిచంద్రన్ ప్రాజెక్టులు
మరోవైపు తాన్యా రవిచంద్రన్ చివరగా సంత్‌కుమార్ దర్శకత్వంలో అర్జున్ దాస్‌తో కలిసి 'రసవాతి' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె 'రెట్ట తల', 'రక్కై ములైతన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. క్రిస్ తిరుకుమరణ్ దర్శకత్వంలో 'రెట్ట తల'లో అరుణ్ విజయ్, సిద్ధి ఇద్నాని నటిస్తున్నారు. 'రక్కై ములైతన్' చిత్రానికి ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు.తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యా 2016లో 'బల్లె వెల్లైయాతేవ' చిత్రంతో నటిగా సినీరంగ ప్రవేశం చేశారు. 2021లో 'రాజా విక్రమార్క' చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2022లో తన మొదటి వెబ్ సిరీస్ 'పేపర్ రాకెట్'లో నటించారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications