బాలయ్యకు బౌన్సర్లు అవసరంలేదు.. రెండు పీకితే చాలు
భారతదేశంలో అమితాబ్ బచన్ తర్వాత సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కల సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నో సంచలన రికార్డులను తన సినిమాలద్వారా నెలకొల్పారు. బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అలాగే వరుసగా మూడు సినిమాలను కూడా హిట్ చేసి మరో హ్యాట్రిక్ అందుకున్నారు.
ఎంతో సింపుల్ గా ఉంటారు
బాలయ్య 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు గుర్తుగా సెప్టెంబరు ఒకటోతేదీన హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగబోతోంది. దీనికి సన్నాహక కార్యక్రమం ఫిలిం చాంబర్ లో జరిగింది. నిర్మాత, దర్శకులతోపాటు బాలయ్య సోదరులు రామకృష్ణ, మోహన్ కృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగ బాలకృష్ణ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తనయుడు అనే విషయంతో సంబంధం లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో సింపుల్ గా ఉంటారన్నారు. పాఠశాలకు వెళ్లే రోజులనుంచి ఈరోజు వరకు ఆయన ఒక్కడే అలా నడుచుకుంటూ వెళతారన్నారు.

ఆయనే రెండు పీకితే చాలు
ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే తానొక్కడే కారు తీసుకొని వెళ్లిపోతారని, తనపక్కన అనుచరులంటూ హంగామా కావాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదన్నారు. అలాగే ఆయనకు బౌన్సర్లు కూడా అవసరం లేదని, ఎవరినైనా కొట్టాలంటే బాలయ్యే కొడతారని, రెండు పీకుతారని, ఆ అవకాశం బౌన్సర్లకు ఇవ్వరన్నారు. ఆయన గట్టిగా రెండు పీకారంటే ఎవరూ దగ్గరకు వచ్చే ధైర్యం చేయరన్నారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా బాలకృష్ణపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో 13 సినిమాలు చేశానంటే ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చన్నారు. దర్శకుడిని ఓ సోదరుడిలా బాలయ్య భావిస్తారన్నారు. దర్శకులు బోయపాటి శ్రీను, వైవీఎస్ చౌదరి, ఇతర ఫిలిం చాంబర్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?












Click it and Unblock the Notifications