జెండా పట్టని అల్లు అర్జున్, నితిన్.. పవన్ కల్యాణ్ ను వాడుకున్నారా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ అనే పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా ఒక స్టార్ హోదాలో పవర్ స్టార్ అనే బిరుదు ఉండగా, ప్రజలకు సేవ చేసేందుకు జనసేన పేరుతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీని నడపడం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. రానున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగారు. 24 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లలో వైసీపీతో జనసేన తలపడబోతోంది.
రాజకీయ పార్టీని నడపడానికి కోట్ల రూపాయలు అవసరమవుతాయి. చాలావరకు తనకున్న ఆస్తులను కూడా అమ్మి పార్టీని నడపుతున్నారని చెబుతున్నారు. తన ప్రయత్నం తాను చేస్తున్నప్పటికీ సరైన సమయంలో సహాయం చేసే విషయంలో మాత్రం చాలామంది తప్పుకుంటున్నారు. అలాగే పవన్ పేరును ఉపయోగించుకొని సినిమాల్లో హీరోలుగా నిలదొక్కుకున్న ఇద్దరు హీరోలు మాత్రం ఇంతవరకు పవన్ కల్యాణ్ పార్టీ గురించి ఎప్పుడూ నోరు తెరవలేదు.. ఆ పార్టీ జెండాను పట్టుకోలేదు. వారెవరంటే.. అల్లు అర్జున్, నితిన్.

వీరిద్దరి కెరీర్ ప్రారంభంలో ప్రతి వేడుకకు హాజరవడంతోపాటు ఇద్దరినీ పవన్ ఎంతో ప్రోత్సహించారు. అల్లు అర్జున్ ఎవరితో సినిమాలు చేస్తే స్టార్ హీరోగా నిలదొక్కుకుంటాడు అనే విషయంలో అన్నయ్య చిరంజీవితో చర్చించి పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులతో సినిమాలు చేయించి పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశారు. అలాగే నితిన్ తన ప్రతి సినిమా ముందస్తు వేడుకలకు పవన్ అభిమానులే ఎక్కువగా హాజరయ్యేవారు. పవన్ కల్యాణ్ కూడా కొన్ని వేడుకలకు హాజరయ్యారు. తప్పొప్పులను సరిదిద్దడంతోపాటు ఎన్నో విలువైన సలహాలను, సూచనలను ఇచ్చారు.
అయితే జనసేనకు అవసరమైన ప్రస్తుత తరుణంలో పార్టీకి విరాళాల రూపంలో ఎటువంటి సహాయం వీరినుంచి అందడంలేదని తెలుస్తోంది. అలాగే పార్టీ తరఫున ప్రచారం చేసి పవన్ పట్ల తమకున్న అభిమానాన్ని కూడా చాటుకోవడంలేదు. అలా ప్రచారం చేస్తే కొందరు దూరమవుతారనే ఆలోచన వీరికున్నా కెరీర్ ప్రారంభంలో పవన్ అభిమానులే వీరిని ప్రోత్సహించిన విషయాన్ని మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా వీరినుంచి ఎటువంటి స్పందన ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications