ప్రతీసారి ఫ్లాప్ సినిమా ఎలా తీస్తావ్ అన్నా..!

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే హిట్ పడాల్సిందే. ఇక్కడ హిట్ కొట్టిన వాళ్లాకే గౌరవంతో పాటు, ప్రాధాన్యత కూడా ఉంటుంది. హీరో , హీరోయిన్ ,దర్శకుడు అయినా అది ఎవరైనా హిట్ ఉంటేనే పక్కన మనుషులు ఉంటారు. అయితే ఓ హీరో మాత్రం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ హీరో హిట్ కొట్టిన సినిమా ఏదో చెప్పడం కూడా కాస్తా కష్టంగానే మారింది. ఆ హీరో మరెవరో కాదు..రవితేజ.

మాస్ రాజా రవితేజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రవితేజ , ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీకోసం' సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు.

Telugu s top hero is suffering from a series of flops

గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటించారు. అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం రవితేజకు అలవాటు. రవితేజ సినిమాల్లో తప్పిస్తే, బయట పెద్దగా కనిపించరు, మాట్లాడరు. రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను ఫ్లాపులతో రవితేజ డీలా పడ్డారు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా నిలిచాయి. 'ఖిలాడీ','రామారావు ఆన్ డ్యూటీ','రావణాసుర','టైగర్ నాగేశ్వర రావు','ఈగిల్' , 'మిస్టర్ బచ్చన్' , ఈ సినిమాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి.విచిత్రం ఏమిటంటే మధ్యలో వచ్చిన 'ధమాకా' సినిమా మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. రవితేజ్ కెరీర్‌లో రూ.100 కోట్లు సాధించిన తొలి సినిమాగా 'ధమాకా' నిలిచింది. ఆ తర్వాత రవితేజను వరుస ఫ్లాపులు వెంటాడాయి.

తాజాగా ఆయన నటించిన 'మాస్ జాతర' సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీనికి తోడు 'బాహుబలి ఎపిక్' రీరిలీజ్ కూడా 'మాస్ జాతర' సినిమాపై ప్రభావం చూపించింది. ఫలితంగా రవితేజ్ కెరీర్‌లోనే వరస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'మాస్ జాతర' నిలిచింది. రవితేజ ఇప్పటికైనా మేల్కొని కథలు, దర్శకుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఆయన కెరీర్ ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+