భార్యకు హీరో విజయ్ విడాకులు..త్రిషకు లైన్ క్లియర్..?
తమిళనాడులో హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. భారీ జనసందోహం మధ్య విజయ్ తన తొలి రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పిల్లలమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ, తమకు అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం రాజకీయాలతో ఆడుకునే పిల్లలమని విజయ్ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు.
విజయ్ ప్రసంగంలో ముఖ్యంగా బీజేపీని డీఎంకేని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది.తమిళనాడులో తన ప్రథమ రాజకీయ శతృవుగా బీజేపీ, ఆ తర్వాత డీఎంకే అని స్పష్టం చేశారు. పార్టీ ప్రాథమిక సూత్రం ప్రకారం అందరూ సమానమనే ఆయన చెప్పారు. విద్వేషపూరితమైన రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని విజయ్ స్పష్టం చేశారు.అన్ని స్థానాల్లో తమిళ వెట్రి కజగం పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని విజయ్ తెలిపారు. తాను పార్టీని ఎవరికి తాకట్టు పెట్టబోనని అభిమానులకు విజయ్ హామీ ఇచ్చారు.

అవసరాలను మట్టి రాజకీయాలు మార్చేవాడిని కాదని, రాజకీయాలను మార్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ తెలిపారు. విజయ్ తన తొలి పొలిటికల్ స్పీచ్‌తో అందర్ని ఆకట్టుకున్నారు. తన తొలి ప్రసంగంతోనే విజయ్ అందర్ని దృష్టి ఆకర్షించారు. మరోవైపు సభ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సభకు దాదాపు 7 లక్షల మంది హాజరైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే విజయ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భార్య సంగీత ఎక్కడ కనిపించలేదు.
గతంలో విజయ్ ఎప్పుడూ తన భార్యతో కలిసి ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలో నైనా సరే సింగిల్‌గానే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని.. వీరు విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు.హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి, హీరోయిన్ త్రిషను త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications