దళపతి విజయ్ కారు ధ్వంసం చేసిన అభిమానులు.. ఎందుకో తెలిస్తే షాక్!!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పార్టీ వ్యవహారాల్లో పూర్తిస్థాయిలో దిగటానికి ముందు తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చెయ్యటంలో బిజీగా ఉన్నారు దళపతి విజయ్.
ప్రస్తుతం దళపతి విజయ్ గోట్ ( గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్ళారు. ఈ సమయంలోనే ఆయన కారు ధ్వంసం అయ్యింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. సినిమా షూటింగ్ కోసం విజయ్ కేరళ వెళ్లారు. చెన్నై నుంచి తిరువనంతపురం చేరుకున్న ఆయన వస్తున్నారని తెలిసిన ఫ్యాన్స్ అంతా విజయ్ ని చూడడానికి తండోపతండాలుగా వచ్చారు.

బైక్ ల పైన, కార్ల లోన విజయ్ ని చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ విజయ్ను ఫాలో అవుతూ ఎయిర్పోర్ట్ వరకు చేరుకున్నారు. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులను కట్టడి చేయడం ఎవరి వల్ల కాలేదు. దళపతి విజయ్ ని చూడాలని బలమైన కోరికతో వచ్చిన ఫ్యాన్స్ ఆయనను చూడడానికి ఎగబడ్డారు. అక్కడ ఉన్న బారికేడ్లను లెక్క చేయకుండా దూసుకు వెళ్లారు. ఇక చాలామంది అయితే కారు పైకి ఎక్కేశారు.
కారు ముందు భాగం అద్దాలు, వెనుక భాగం అద్దాలు పగిలిపోయాయి. కారు భారీగా డామేజ్ అయింది. దీంతో కార్లో నుంచి బయటకు దిగిన విజయ్ ధ్వంసం చేసిన ఫ్యాన్స్ ను ఒక్క మాట కూడా అనలేదు. కొంచెం కూడా కోపగించుకోలేదు. తనపై వారు చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు విజయ్ చలించిపోయాడు. కార్లో నుండి బయటకు వచ్చిన విజయ్ అందరికీ అభివాదం చేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు.
ఒక్క తమిళనాడులోనే కాదు కేరళలోని విజయ్ కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదని ఘటనతో అర్థమవుతుంది. ఇక విజయ్ కు ఉన్న క్రేజ్ ను చూసి సినీ వర్గాలే కాదు, రాజకీయ పార్టీల నేతలు కూడా భయపడుతున్నారు. ఇక విజయ్ పొలిటికల్ గా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఇంకెంత హడావిడి ఉంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications