నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే: సమంత
తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని కథానాయిక సమంత వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు చక్కగా జవాబులిస్తుంటారు. మరోసారి ఆమె అభిమానులకు సమాధానమిస్తూ తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి? అనేది చెప్పారు.
తన ఇష్టాలను గుర్తించడంలేదనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నానని, ఎందుకంటే తన భాగస్వామి గతంలో వాటిని ప్రభావితం చేశాడని చెప్పారు. క్లిష్టమైన పరిస్థితుల నుంచే పాఠం నేర్చుకుంటామనే విషయం అప్పుడే అర్థమైందన్నారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తాను గ్రహించగలిగానో అప్పటినుంచే తన ఎదుగదల ప్రారంభమైందని చెప్పారు.

Recommended Video

సమంత గతంలో ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన విడాకులు, వరుస ఫ్లాపులతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయని, దీంతో తాను ఎంతో కుంగిపోయినట్లు వెల్లడించారు. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటోందని, మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని.. దీంతో కుంగుబాటుకు గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మయోసైటిస్ తో బాధపడుతుండటంతో దానికి చికిత్స తీసుకోవడం కోసం సమయాన్ని కేటాయించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలవడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు కొద్దిరోజుల క్రితమే నిర్మాతగా మారి ఒక సంస్థను ప్రారంభించారు.ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రతిభావంతులైన కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహించనున్నారు. తన నిర్మాణ సంస్థద్వారా ఎంతోమంది ప్రతిభ కలిగినవారు వెలుగులోకి రావాలనేది సమంత కోరిక.












Click it and Unblock the Notifications