అందుకే ఆ విషయాన్ని బయటపెడుతున్నా: సమంత
స్టార్ కథానాయికగా కొనసాగుతున్న సమంత సినీ పరిశ్రమలోకి 14 సంవత్సరాల క్రితం అడుగుపెట్టింది. వాస్తవానికి సమంత అనగానే మనకు రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. మయోసైటిస్ కాగా, మరోది నాగచైతన్యతో వివాహం.. విడాకులు. మయోసైటిస్ కు చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కథలను వింటోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సాధ్యమైనన్నిఎక్కువ సినిమాల్లో ఒప్పుకొని అభిమానులకు దగ్గరవ్వాలని, మళ్లీ వారిచేత ప్రశంసలు అందుకోవాలని ఆశిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పకటిప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఈవెంట్స్ కు హాజరవుతోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు వైరలయ్యాయి. ప్రతిరోజు తాను 10 రకాల పనులు చేస్తానని, కేవలం ఐదు గంటలే నిద్రపోతానని తెలిపింది. తన కెరీర్ లో చాలాసార్లు ఎంతో బాధపడిన సందర్భాలున్నాయని, పరిశ్రమలో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ దాన్ని ఆస్వాదించలేకపోయినట్లు చెప్పింది.

విజయం సాధించినప్పటికీ అది తనవల్ల కాదేమో అన్న భ్రమలో ఉండేదాన్నని, నటిగా 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాన్నారు. అయితే తాను ప్రధాన పాత్రలో నటించి యశోద చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానన్నారు. వాటిపై చాలా రూమర్స్ వచ్చాయన్నారు. వాటిని తట్టుకోలేకపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో మయోసైటిస్ గురించి బయటపెట్టక తప్పలేదన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సరిగా చేయకపోతే సినిమా ఫ్లాపవుతుందని నిర్మాత చెప్పారని అందుకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చానన్నారు. తర్వాత చికిత్స కోసం ఇంట్లోనే ఉండిపోయినట్లు సమంత వెల్లడించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఓ చిత్రంలో సమంత నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయికానీ చిత్ర యూనిట్ దాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications