Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరో భార్యకు నటి సాఫ్ట్ రిప్లే, నా కూతురు నీ మొగుడికి పుట్టిందని నేను చెప్పానా ?, మైండ్ బ్లాక్ !

స్యాండిల్ వుడ్ హీరో, చాలెంజింగ్ స్టార్, డి బాస్ దర్శన్ సంసారం గొడవలు మళ్లీ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తోంది. దర్శన్ భార్య విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడల మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ఫైట్ వైరల్‌గా మారింది. దర్శన్‌తో 10 సంవత్సరాల అనుబంధాన్ని పూర్తి చేసుకున్న పవిత్రా గౌడ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దర్శన్‌తో ఉన్న ఫోటోలను పంచుకోవడంతో ఈ వివాదం మొదలైంది.

నటి పవిత్రా గౌడ పోస్ట్ చూసి మనస్తాపానికి గురైన హీరో భార్య విజయలక్ష్మి దర్శన్ వేరొక మహిళ భర్తతో తీసుకున్న ఫోటోలు షేర్ చేయడానికి సిగ్గుండాలని పవిత్రా గౌడపై మండిపడింది. పవిత్రా గౌడ పోస్టు చేసిన ఫోటోలకు కౌంటర్ ఇస్తూ విజయలక్ష్మి పవిత్రా గౌడ, ఆమె భర్త సంజయ్ లను ప్రశ్నించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి పోస్ట్‌పై పవిత్రా గౌడ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను షేర్ చేసి తన మీద చెడు వ్యాఖ్యలు చేసే వారిని నటి పవిత్రా గౌడ హెచ్చరించింది. తనకు, హీరో దర్శన్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా పవిత్రా గౌడ క్లారిటీ ఇచ్చారు.

The actress gave a soft reply to the star heros wife that I never said that my daughter was born to your husband

పవిత్ర గౌడ పోస్టులో ఏం రాసింది ?

నేను పవిత్రా గౌడ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నాను, నా కూతురు పేరు ఖుషీ గౌడ. నేను సంజయ్ అనే వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నానని, ఆపై ఖుషీ గౌడ మాకు పుట్టిందని. మా జీవితంలో కొన్ని సమస్యల కారణంగా సంజయ్‌ గౌడతో తాను విడాకులు తీసుకున్నానని. తరువాత తాను తన కూతురు ఖుషీ గౌడతో కలిసి వేరుగా జీవిస్తున్నానని. ఖుషీ గౌడ హీరో దర్శన్ కూతురు అని నేను ఇక్కడ చెప్పలేదని, తాను దర్శన్ ను పెళ్లి చేసుకున్నానని కూడా ఎక్కడా చెప్పలేదని పవిత్రా గౌడ వివరించింది.

హీరో దర్శన్ నేను గత 10 సంవత్సరాలుగా సంతోషంగా కలిసి ఉన్నాము. నేను ఏ వ్యక్తిగత స్వార్థం కోసం, ఏ ఎజెండా కోసం ఇలా చెయ్యడం లేదని అందరూ గమనించండి. పవిత్రమైన ప్రేమతో తాము 10 సంవత్సరాలు కలిసి ఉండటం అంత సులభం కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని. ఈ విషయం దర్శన్ భార్య విజయలక్ష్మికి కూడా ముందే తెలుసు అని పవిత్రా గౌడ వివరించారు. విజయలక్ష్మి నాకు చాలాసార్లు ఫోన్ చేసి ఈ విషయమై నాతో మాట్లాడిందని, నీ గురించి ఎలాంటి సమస్య లేదని ఆమె తనతో చెప్పిందని పవిత్రా గౌడ ఇన్ స్టాగ్రామ్ లో వివరించింది.

The actress gave a soft reply to the star heros wife that I never said that my daughter was born to your husband

సమయం వచ్చినప్పుడు నేను కొన్ని రికార్డులు, పత్రాలు, తన విడాకుల పత్రాలను అందరితో పంచుకుంటానని పవిత్రా గౌడ స్పష్టం చేశారు. దర్శన్ భార్య విజయలక్ష్మి నాకు వ్యతిరేకంగా పోస్ట్ చేయడం బాధాకరంగా ఉందని, నా గురించి, నా కూతురు ఖుషీ గౌడ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విజయలక్ష్మి నన్ను అసభ్య పదజాలంతో దూషించారని, అది నాకు మానసిక వేదన కలిగించిందని పవిత్రా గౌడ ఆవేదన వ్యక్తం చేసింది.

నా వ్యక్తిగత ఫోటోలు, పర్సనల్ ఫోటోలు, నా జీవితంలోని పాత కథలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదని, ఇలా చేసిన వారి మీద తాను చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని, కానీ నేను దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని, ఇంకోసారి ఇలా చెయ్యకూడదని తాను సూచిస్తున్నానని పవిత్రా గౌడ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

The actress gave a soft reply to the star heros wife that I never said that my daughter was born to your husband

హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి విషయంలో సాఫ్ట్ గా వ్యవహరించిన పవిత్రా గౌడ ఈ గొడవలకు స్వస్తి చెప్పాలని అనుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఇలా పోస్టు చేసి ఉంటుందని హీరో దర్శన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం ఎక్కడికి వెలుతుందో అని హీరో దర్శన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద హీరో దర్శన్ ఆయన భార్య, స్నేహితురాలి మధ్య చిక్కుకున్నాడని కొందరు హీరోల ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+