"చేతబడి" ..టైటిలే కాదు పోస్టర్ కూడా దారుణంగా ఉంది..!
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మాణంలో, నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం "చేతబడి". రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, బాణామతి ప్రపంచంలోని భయంకరమైన కోణాలను ఆవిష్కరించనుంది.
దర్శకుడు సూర్యాస్: "జుట్టుతో ముడిపడిన భయంకరమైన చేతబడి విద్య"
దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ, "చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కళ. ఇది రెండు దేశాలను విడగొట్టాలన్నా, కలపాలన్నా, కేవలం ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్య. ఇది ఎంత భయంకరంగా ఉంటుందో చాలా సినిమాల్లో చూపించినప్పటికీ, మేము చాలా విభిన్నంగా చూపిస్తున్నాం" అని తెలిపారు.

"మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది, జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1953లో గిరిడ అనే గ్రామంలో నిజంగా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశాం" అని సూర్యాస్ వివరించారు.
"సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఇందులో చూపించబోతున్నాం" అని సూర్యాస్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications