పవన్ కల్యాణ్ గెలిస్తే గుండు కొట్టించుకుంటా: హీరోయిన్

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాద్వారా తెలుగు తెరకు చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినప్పటికీ రెండో సినిమా నుంచే తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అభిమానులకు భిన్నమైన సినిమాలను అందించారు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. స్టార్ హీరోగా అవతరించిన తర్వాత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు.

పవన్ ప్రమేయంతోనే ప్రభుత్వం
2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా విడిగా పోటీచేశారు. ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీపై బలంగా పడింది. జనసేనకు వచ్చిన ఓట్ల తేడానే టీడీపీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్నారు. తాను స్వయంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ ప్రమేయమున్న ప్రభుత్వమే కచ్చితంగా ఏర్పాటవబోతోందని సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ అభిమానులు బలంగా చెబుతున్నారు.

the heroine will get shaved if pawan kalyan wins

ఆ హీరోయిన్ సిద్ధంగా ఉండాలి
ఇటువంటి తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా పడి చచ్చిపోయే ఓ హీరోయిన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ భారీ మెజారిటీతో గెలిస్తే గుండు కొట్టించుకుంటానని దేవుడికి మొక్కుకుంది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. పవన్ కల్యాణ్ విజయం సాధించడం పక్కా అని, గుండు కొట్టించుకోవడానికి ఆ హీరోయిన్ సిద్ధండా ఉండాలంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాతోపాటు తెలుగు సినీ పరిశ్రమ, ఏపీ రాజకీయాల్లో ఈ విషయం సంచలనంగా మారింది. అభిమానుల నుంచే కాకుండా పరిశ్రమ నుంచి కూడా పవర్ స్టార్ కు ఇంత అభిమానం దొరకడం అదృష్టమంటున్నారు సినీ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+