సాయి పల్లవిని డామినేట్ చేసిన ఏకైక హీరో
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు.

కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. చాలాకాలం తర్వాత తెలుగులో నటించింది సాయి పల్లవి. నాగ చైతన్య హీరోగా నటించి తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. సాధారణంగా సాయి పల్లవి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను కట్టిపడేస్తోంది. స్టార్ హీరోలు సైతం ఆమె సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా కనిపిస్తారు. ఆ రకంగా సాయి పల్లవి తన డామినేషన్ చూపిస్తుంటుంది.
అలాంటి సాయి పల్లవిపై తొలిసారి ఓ హీరో తన అధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆ హీరో మరెవ్వరో కాదు.నాగ చైతన్య. గత మూడేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగ చైతన్య, తండేల్ మూవీతో ప్రేక్షకు ముందుకొచ్చాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి.

అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో నాగ చైతన్య తన నటనతో కంటతడి పెట్టించాడు.నాగ చైతన్య యాక్టింగ్ చేస్తున్నాడని ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్‌కు నాగ చైతన్య అడ్డుకట్ట వేశాడు. చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్‌కు లీడర్‌గా, పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య మెప్పించారు. మొత్తానికి సాయి పల్లవిని డామినేట్ చేసిన హీరోగా నాగ చైతన్య నిలిచాడు.












Click it and Unblock the Notifications