దేవర విడుదల తేదీ వచ్చేసింది..
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు.
యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది మూవీ. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ (Devara first look) హైప్ క్రియేట్ చేసింది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ మూవీ విడుదల తేదీ వెల్లడయింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే నెల 12వ తేదీన విజయదశమి. అంతకంటే ముందే అంటే దుర్గాష్టమి రోజున దేవర విడుదల కానుంది.
నిజానికి- ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ పార్ట్ ఈ విడుదల అవుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి మొదట్లో. ఆ తేదీ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సినిమా యూనిట్ కష్టపడింది గానీ ఫలితం దక్కలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత అంతకుమించిన స్థాయిలో ఉండేలా దేవరను తీయాలనే ఉద్దేశంలో చిత్రం యూనిట్ ఉంది.
#Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7
— Jr NTR (@tarak9999) February 16, 2024
దేవర ఫస్ట్ గ్లింప్సెస్ ఇప్పటికే విడుదల అయ్యాయి. దీనితో పాటు ఓ షార్ట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ ఆఫ్ దేవర దీన్ని విడుదల చేశారు నిర్మాతలు. ఈ టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. జూనియర్ నుంచి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
-
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం












Click it and Unblock the Notifications