త్వ‌ర‌లో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు తెలియ‌నీ సినీ అభిమానులు ఉండరు. త‌న మ్యూజిక్‌తో ఎంతోమంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఎంతో స్టార్ హీరోల సినిమాల‌కు అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించాడు. మ‌హేష్‌బాబు, అల్లుఅర్జున్ వంటి స్టార్స్ అంద‌రికీ సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. ఈయ‌న తెలుగులో సంగీత దర్శకుడిగా ప‌నిచేసిన మొద‌టి చిత్రం రవితేజ నటించిన కిక్. ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలోని పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. అయితే, తాజాగా త‌మ‌న్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. త‌మ‌న్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు తెలుస్తోంది. ఈయ‌న గ‌తంలో బాయ్స్ అనే చిత్రంలో సైడ్ యాక్టర్‌గా ఓ పాత్రలో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లోనే త‌మ‌న్ ఓ సినిమాలో క‌నిపించ‌బోతున్నార‌ని ప్ర‌చారం వ‌స్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారట. యూట్యూబ‌ర్ నిహారిక ఈ మ‌ధ్య‌కాలంలో సెల‌బ్రిటీల‌తో చేసిన రీల్స్‌తో ఎంతో ఫేమ‌స్ అయ్యింది. ఈమె త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇయ్య‌నుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో అధర్వ కీల‌క‌మైన పాత్ర పోషించ‌నున్నార‌ట‌.

The star music director who will enter the movies soon

ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఇదే చిత్రంలో త‌మ‌న్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈవిష‌యంపై అటు త‌మ‌న్ కానీ, చిత్ర యూనిట్ కానీ అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియాలంటే మ‌ర‌కొన్ని రోజులు ఆగాల్సిందే..ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+