తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఘోరమైన డిజాస్టర్ మూవీ

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం అనే సాంప్రదాయం కొనసాగుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, హీరోలు అడిగిందే తడవుగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతూ, హీరోలకు వందలకోట్ల రూపాయల పారితోషికం ఇస్తూ ఇష్టారాజ్యంగా సినిమాలను నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ బడ్జెట్ సినిమాలను చూస్తుంటే డబ్బులా? లేదంటే చిల్లపెంకులా? అనే అనుమానం అందరికీ కలుగుతోంది. ఎందుకంటే మన నిర్మాతలు అలా ఖర్చుపెడుతున్నారు.

ఒక్క పాట కోసం రూ.75 కోట్లు తగలేయించాడు
దర్శకుడు శంకర్ గురించి తెలిసిందే. నిర్మాతలతో విపరీతంగా ఖర్చుపెట్టిస్తాడు. డబ్బులు మనవి కావంటే ఎలాగైనా ఖర్చు చేయొచ్చు.. ఖర్చు పెట్టించొచ్చు. సగటు మనిషి ఆలోచన ఇలాగే ఉంటుంది. కానీ అందరూ ఇలా ఉండరు. శంకర్ మాత్రం అలాగే ఉంటారు. ఒకప్పుడు శంకర్ సినిమాలు ఆడేవి. పెట్టిన డబ్బు తిరిగొచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనా తీరును అర్థం చేసుకోకుండా తాను అనుకున్న ధోరణిలోనే సినిమాలు తీస్తూ నిర్మాతలను నిండా ముంచేస్తున్నాడు. తాజాగా అతను తీసిని గేమ్ ఛేంజర్ సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ సినిమాగా నిలిచింది.

The worst disaster movie in the Telugu film industry

దిల్ రాజుకు పీడకల
ఈ సినిమాకు శంకర్ రూ.450 కోట్లు ఖర్చుపెట్టించాడు. ఒక్క పాట కోసం రూ.75 కోట్లు తగలేయించాడు. చివరకు సినిమా విడుదలైతే అందులో ఈ పాట లేదు. అదీ శంకర్ సినిమా పరిస్థితి. మొదటిరోజు రూ.51 కోట్లు రాగా, రెండోరోజు రూ.21 కోట్లు, మూడోరోజు రూ.16 కోట్లు వచ్చాయి. మొత్తంమీద అన్ని భాషల్లో కలుపుకొని కేవలం రూ.131 కోట్లు రాబట్టగలిగింది. అందులో ఒక్క తెలుగులోనే రూ.89 కోట్లు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఎంత భారీగా నష్టపోయాడో అర్థం చేసుకోవచ్చు. తన బ్యానరుపై 50వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆశపడ్డ దిల్ రాజు ఆశలపై శంకర్ నీళ్లు చల్లాడు. తెలుగ సినీ పరిశ్రమలో అత్యంత ఘోరమైన డిజాస్టర్ మూవీగా రికార్డును మాత్రం ఇచ్చాడు. దిల్ రాజు అనుకున్నదొక్కటి.. చివరకు అయినదొక్కటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+