నాకు తెలియకుండానే నన్ను హీరోని చేశారు.. అందుకే అలా ?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నారు " వెన్నెల కిషోర్ " అమెరికాలో ఎంఎస్ చదివి.. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండియాకు వచ్చేశారు. టాలీవుడ్ లో మొదటిగా "వెన్నెల" సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి వరుస అవకాశాలను దక్కించుకున్నారు. బ్రహ్మానందం తర్వాత ఆయన లెగసినీ నిలబెట్టే హాస్యనటుడు అంటూ పలువురు ప్రముఖులు సైతం వెన్నెల కిషోర్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా పలు సినిమాల్లో కూడా హీరోగా నటించారు. అయితే వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్‌కి రాడు అనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీవిష్ణు హీరోగా నటించిన "సింగిల్" మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడంపై ఓపెన్ అయ్యారు. ఒకప్పుడు ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేవారు. బ్రహ్మ ఆనందం సినిమా నుంచి కాస్త మీడియా ముందుకు వస్తున్నారు. ఎందుకు మీలో ఈ మార్పు ? అని ప్రశ్నించారు.

అందుకు సమాధానం చెబుతూ.. ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినా జనాలు థియేటర్లకు వస్తారని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా బయటకు వచ్చి నా వంతు ప్రమోషన్ చేయడం చాలా ముఖ్యం అనిపించింది. అంతే కాకుండా షూటింగ్ డేట్స్ కారణంగా ప్రమోషన్స్‌కి హాజరు కాలేకపోయేవాడిని అని చెప్పారు. ఇంటర్వ్యూలు ఉదయం 10 తర్వాతే ఉండడం.. సాయంత్రం జరిగే ఈవెంట్స్‌కి రావాలన్నా లేట్ అవుతుంది అనే మరో అపవాదు కూడా ఉంటుంది. అందుకే ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నా అని చెప్పుకొచ్చారు.
నాకు తెలియకుండానే హీరో చేశారు..
మరోవైపు తాను హీరో అని తనకే తెలియకుండా ఒక సినిమా చేసినట్లు వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. "శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్" సినిమాలో తానే హీరో అనే సంగతి తెలియదని చెప్పారు. ముందుగా సినిమా కథ మొత్తం చెప్పలేదని.. తన ట్రాక్ వరకే అడిగి షూటింగ్ పూర్తి చేశానని అన్నారు. అంతే కాకుండా సినిమా రిలీజ్ సమయంలో తానే హీరో అని పోస్టర్ వేస్తే ఆశ్చర్యపోయానని.. ముందు చెప్పినప్పుడు ఆ సినిమాలో వేరే హీరో ఉన్నాడని.. కానీ చివరికి నన్ను హీరోగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని వెల్లడించారు. ముందే నాకు దర్శక నిర్మాతలు నేనే హీరోనని చెప్పి ఉంటే.. ప్రమోషన్స్‌కి కూడా వచ్చే వాడినని వివరించారు.
ఇక మరో విషయం ఏంటంటే.. తాను చాలా ఇంట్రోవర్ట్ అని స్పష్టం చేశారు. ఏదైనా ఒక ఈవెంట్‌లో ఎవరి గురించైనా మాట్లాడటం మరచిపోతే.. వాళ్లు ఏమనుకుంటారో అని ఆగిపోవాల్సి వచ్చేదన్నారు. అందుకే అసలు ఆగిపోతే బెటర్ అని ఇన్నాళ్లు ఆగిపోయానని.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకి రావాలని అర్థం చేసుకుని వస్తున్నానని తెలిపారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications