తెలుగులో ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఇదొక్కటే

తెలుగు సినీ చరిత్రలో థియేటర్‌లో అత్యధిక రోజులు ఆడిన సినిమా 'లెజెండ్'. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ చిత్రం, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 1000 రోజులకు పైగా, అంటే సుమారు మూడు సంవత్సరాలకు పైగా నిరాటంకంగా ఆడింది. ఇది ఒక అరుదైన రికార్డు. ఇదే సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూడా 1000 రోజులు పూర్తి చేసుకుంది. లెజెండ్ కాకుండా తెలుగులో ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

మగధీర (2009): రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్‌లో 1000 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇది బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది.

This is the only movie that has played for the longest time in Telugu

పోకిరి (2006): మహేష్ బాబు నటించిన ఈ సినిమా కూడా కర్నూలులో 500 రోజులకు పైగా ఆడింది. ఇది ఆ కాలంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

మంగమ్మ గారి మనవడు (1984): నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా 567 రోజులు ఆడి ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో బాలయ్య తిరుగులేని హీరోగా మారాడు.

ప్రేమాభిషేకం (1981): అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం సుమారు 533 రోజులు ఆడి ఆ కాలంలో ఒక రికార్డును నెలకొల్పింది. ఇది పలు కేంద్రాలలో 365 రోజులు ఆడింది. దాసరి నారాయణరావు దీనికి దర్శకుడు.

This is the only movie that has played for the longest time in Telugu

లవకుశ (1963): సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఈ మొదటి తెలుగు పూర్తి రంగుల చిత్రం 469 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది.

ప్రేమ సాగరం (1983): టీ రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా 465 రోజులు ఆడి భారీ విజయం సాధించింది.

వెయ్యి రోజులు అనేది అసాధ్యం
గతంలో సినిమాలు 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, 365 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడటం అనేది సాధారణం. అప్పట్లో తక్కువ థియేటర్లు ఉండటం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు లేకపోవడం, ప్రేక్షకులు సినిమాలు చూడటానికి థియేటర్లపై మాత్రమే ఆధారపడటం వల్ల సినిమాలు ఎక్కువ కాలం ప్రదర్శించబడేవి. అందరూ బాగుండేవారు. కానీ ప్రస్తుత కాలంలో, సినిమా విడుదలైన వారం లేదా పది రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టడంపై దృష్టి పెడుతున్నారు. చాలా సినిమాలు వారం లేదా రెండు వారాల్లోపే థియేటర్‌ల నుంచి వెళ్లిపోతున్నాయి. అందుకే ఇప్పుడు 50 రోజులు ఆడటమే ఒక పెద్ద రికార్డుగా పరిగణించబడుతోంది. "1000 రోజులు" వంటి రికార్డులు ఇకపై ఉండవు. ఇది అసాధ్యం అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+