రాజకీయ నాయకుడి కుమారుడితో తెలుగు స్టార్ హీరోయిన్ పెళ్లి?
ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో ఎక్కడ చూసినా పెళ్లిళ్ల హడావిడే కనపడుతోంది. బ్రహ్మచారి జీవితం గడుపుతున్నవారంతా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అపర్థాదాస్ లాంటివారు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అదితిరావు హైదరీ, తమన్నా క్యూలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్ హీరోయిన్ చేరింది.. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఆ ముద్దుగుమ్మ చేసి వెడ్డింగ్ వైబ్స్ పోస్టే దీనికి కారణమని చెప్పొచ్చు.
తెలుగు, తమిళ బ్యూటీ అయిన మేఘా ఆకాష్ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. లై సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. నటన పరంగా రాణించడంతోపాటు సినిమా ఫ్లాపైనప్పటికీ అవకాశాలు వరుసగా వచ్చాయి. చల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమదేశం, రాజరాజచోర, గుర్తుందా శీతాకాలం, రావణాసుర, మనుచరిత్ర లాంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళలో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కొడుకును పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేఘా ఆకాష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తాజాగా ఈ బ్యూటీ పెళ్లి కూతురి వేషధారణలో దర్శనమిచ్చింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. దీంతో మరోసారి మేఘా ఆకాష్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లికి సిద్ధం కాబోతోందంటూ చర్చించుకుంటున్నారు. అది నిజం కాదని, యాడ్ షూట్ కోసం తీసిన తాజా చిత్రాలని, అందులో భాగంగానే వాటిని ఇన్ స్టాలో షేర్ చేసిందంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ దూరం ఆలోచించడం.. మనకు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడటం, కామెంట్లు పెట్టడం సరికాదని నెటిజన్లకు మేఘా ఆకాష్ అభిమానులు సూచిస్తున్నారు. వాస్తవం తెలుసుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు రాయడం సరికాదని హితవు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications