'నా కూతురుకి మెంటల్.. ఆమె వలన ప్రమాదం ఉంది'.. పోలీసులకు స్టార్ హీరోయిన్ తండ్రి ఫిర్యాదు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కల్పిక గణేష్ అంటే టక్కున గుర్తుపట్టడం కష్టమే. కానీ జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్, యశోద.. తదితర చిత్రాలు చూసినవారికి ఈమె ఎవరో గుర్తొస్తుంది. ఈ సినిమాల్లో కనిపించి నటనతో మెప్పించింది. అయితే ఇటీవల తరచూ ప్రైవేట్ వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతూ వార్తల్లో నిలుస్తోంది కల్పిక. తోటి నటీనటులతో గొడవలు పెట్టుకోవడంతో పాటు గత నెల ఓ పబ్ లో రచ్చ రచ్చ చేసింది. బిల్ కట్టకుండా వివాదం పెట్టుకుంది. దాంతో ఆమె వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఓ రిసార్ట్ లోనూ ఆమె న్యూసెన్స్ చేస్తూ వైరల్ అయింది. సిగరెట్లు కావాలంటూ అక్కడి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించింది. దీనిపై ఆమె ఇటీవల మాట్లాడుతూ.. 'అవును.. నా ఇన్ స్టా అకౌంట్ కు ఫాలోవర్స్ కావాలి.. కాబట్టి నాకు కాంట్రవర్సి కావాలి, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పింది. అయితే ఈమె గురించి తెలిసినవాళ్లు అటెన్షన్ కోసం చేస్తుందని కొందరూ.. ఆమె మానసిక స్థితి సరిగా లేదని అందుకే అలా చేస్తుందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు.

Tollywood Shock Kalpika Ganesh s Father Files Complaint Cites Mental Health Concerns

అయితే తమ కూతురు రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్‌ లో ఉంది. తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తోంది. తమ కూతురిని తిరిగి మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌ కు తరలించేందుకు చర్యలు తీసుకోండి అంటూ పోలీసులను ఆశ్రయించారు కల్పిక గణేష్ తండ్రి. ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ లోని ప్రిజమ్ పబ్‌ లో ఆమె ప్రవర్తనపై పెద్ద రచ్చ జరిగింది. అక్కడ పబ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీసుల ఎదుటే బూతులు తిడుతూ రెచ్చిపోయిన వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+