సీక్రెట్ పెళ్లి చేసుకున్న 'స్పైడర్ మ్యాన్'.. ఫోటో వైరల్..!!

స్పైడర్ మ్యాన్ అంటే మనకు తెలిసిందే. స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసేందుకు పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. స్పైడర్ మ్యాన్ విన్యాసాలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే హాలీవుడ్ సూపర్ హీరోల్లో స్పైడర్ మ్యాన్ ఒకరు.. ఇప్పటికే స్పైడర్ మ్యాన్ పై చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఈ జనరేషన్ కు స్పైడర్ మ్యాన్ హీరో అంటే టామ్ హోల్లాండ్ అని టక్కున చెప్తారు.

స్పైడర్ మ్యాన్ సిరీస్ లో నటించిన ఈ 29 ఏళ్లు కుర్రాడు హాలీవుడ్ మూవీస్ చూసేవారికి సుపరిచితమే.. 2013 లోకీ అనే హాలీవుడ్ చిత్రంలో తొలిసారిగా నటించాడు టామ్ హోల్లాండ్.. ఆ తర్వాత హౌ ఐ లీవ్ నౌ అనే చిత్రంలోనూ నటనతో మెప్పించాడు. ఇక 2015 లో ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సీ చిత్రంలో నటించాడు టామ్. ఆ తర్వాత 2016 లో కాప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో కీలక పాత్రలో నటించాడు.

2016 లోనే ది లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్, అలాగే 2017 లో పిలిగ్రిమేజ్ లో నటించాడు. ఇక 2017 లో స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఫ్యాన్స్ కు క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతమైన నటనతో టామ్ హోల్లాండ్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా అవెంజర్ ఇన్ ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాల్లో సూపర్ హీరోగా నటించాడు. 2019 లో స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ చిత్రంతో మరోసారి ఆ పాత్రలో మెప్పించాడు. ఇక 2021 లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, 2022 లో అన్ చార్టెడ్ మూవీస్ లో నటించి మెప్పించాడు.

TomHolland Secret Wedding Shocks the Fans Viral Photo Confirms Spider-Man Hero Tied the Knot

ఇక టామ్ హోల్లాండ్ గత కొంతకాలంగా జెందయా అనే హాలీవుడ్ నటితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా టామ్ హోల్లాండ్.. జెందయాను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను సీక్రెట్ గా ఓ చర్చిలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు టామ్ హోల్లాండ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+