త్రిషకు ఖరీదైన ఫ్లాట్ రాసిచ్చిన టాప్ పొలిటీషియన్?
అందానికి చిరునామాగా ఐశ్వర్యరాయ్ పేరు చెబుతారు. కానీ ప్రస్తుతం మాత్రం అందానికి చిరునామాగా త్రిష పేరు చెబుతున్నారు. అంతగా అందరినీ ఆకట్టుకుంటోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో 41 సంవత్సరాల వయసులో కూడా టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది త్రిష. కెరీర్ ప్రారంభం నుంచి మధ్యలో కొంత నెమ్మదించినప్పటికీ ఇప్పుడు తిరిగి జెట్ స్పీడ్ తో కెరీర్ లో దూసుకుపోతోంది. వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసింది. తాజాగా చిరంజీవి విశ్వంభరలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మే తొమ్మిదోతేదీన విడుదల కాబోతోంది. తమిళంలో రెండు సినిమాలు, మళయాళంలో ఓ సినిమా చేస్తోంది.
విజయ్ మీద అభిమానంతో ఐటం సాంగ్
తమిళంలో స్టార్ హీరోగా చెలామణి అవుతున్న దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. కేవలం విజయ్ మీద ఉన్న అభిమానంతోనే ఐటం సాంగ్ చేసిందికానీ వాస్తవానికి ప్రత్యేక గీతాల్లో నటించడానికి త్రిష ఆసక్తి చూపించదు. సినిమా సరిగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం సినిమాకే హైలైట్ గా నిలిచింది. నాలుగు పదుల వయసులో కొత్తగా వచ్చే హీరోయిన్లకు పోటీ ఇస్తున్న త్రిష గతంలో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోవాలనుకుందికానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరినీ వివాహం చేసుకోలేదు. గతంలో తాను నివసించిన మొదటి ఇంటిని తెలుగు నటుడు భానుచందర్ కు అమ్మేసి కొత్త ఇంటికి మారింది.

కొంతకాలం నుంచి విజయ్ తో స్నేహం
కొంతకాలం నుంచి విజయ్ తో త్రిషకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఎక్కడ చూసినా ఇద్దరూ చాలా సన్నిహితంగా కలిసిమెలిసి తిరుగుతున్నారని, కనపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. దానికితోడు ఫొటోలు కూడా వస్తున్నాయి. తాజాగా త్రిషకు టాప్ రాజకీయ నాయకుడు ఒకరు ఖరీదైన ఫ్లాట్ ను బహుబతిగా రాసిచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అతను ఎవరు అనే విషయంలో ఎవరికీ స్పష్టత రాలేదు. హీరో విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీ స్థాపించి బహిరంగ సభను నిర్వహించారు. ప్రస్తుతం అతని పార్టీ అన్నాడీఎంకేను లక్ష్యంగా ఎంచుకుంది. ఈ క్రమంలో టాప్ పొలిటీషియన్ అంటే విజయ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిషకు ఖరీదైన ఫ్లాట్ రాసిచ్చింది విజయ్ కావొచ్చని కొందరు. అందులో సందేహం లేదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications