అమెజాన్ ప్రైమ్ లో టాప్ ట్రెండింగ్ లో సూపర్ హిట్ తెలుగు సినిమా!!
కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. ఈ సినిమా ప్రస్తుతం ఓటిటీని అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 15వ తేదీన విడుదలై తమిళంతో పాటు తెలుగు భాషలలో భారీ వసూళ్లను సాధించింది.
బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది మార్క్ ఆంటోనీ మూవీ.అక్టోబర్ 13వ తేదీన ప్రముఖ ఓటిటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది మార్క్ ఆంటోనీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో మార్క్ ఆంటోని సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్న మార్క్ ఆంటోనీ సినిమా ఇప్పుడు ఓ టి టి ని అదరగొడుతుంది. ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీ లో రికార్డు సృష్టించడం పై హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు హీరో విశాల్ ఒక ట్వీట్ చేశారు.
మార్క్ ఆంటోనీ సినిమా ఓ టి టి ప్లాట్‌ఫారమ్‌లో కూడా దూసుకుపోవడాన్ని చూసి సంతోషిస్తున్నాను. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ నంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. అపరిమిత వినోదాన్ని ఆస్వాదించండి, ముఖ్యంగా నాకు ఇష్టమైన సిల్క్ స్మిత సన్నివేశాన్ని ఇప్పుడు మీ స్వంత ఇళ్లలో ఆస్వాదించండి అంటూ ట్వీట్ చేశారు.
మొత్తానికి మార్క్ ఆంటోనీ ఓ టి టిలో అదరకొడుతూ ఉండడం విశాల్ కు సంతోషం కలిగిస్తుంది. ఈ సినిమాకి కూడా చూసిన వారి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్క్ ఆంటోనీ సినిమా విశాల్ కెరీర్ లోని తొలి 100 కోట్ల రూపాయల చిత్రం. హీరో విశాల్, ఎస్ జె సూర్య నటన అందరిని ఆకట్టుకుంది. ఈ సైన్స్ యాక్షన్ ఫిక్షన్ కామెడీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications