మెగాస్టార్‌కు కథ వినిపించిన త్రివిక్రమ్?
Megastar Chiranjeevi: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డుల్లో ఏపీికి చోటు దక్కింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి.. రెండో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవిని అభినందిస్తోన్నారు. ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, పలువురు టెక్నీషియన్ల రాకపోకలతో చిరంజీవి నివాసం రద్దీగా మారింది.
చిరంజీవిని కలిసి శుభాకాంక్షలను తెలియజేసిన వారిలో విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ట, మారుతి, ఛోటా కే నాయుడు, మయూఖ్ ఆదిత్య, నిమ్మగడ్డ శ్రీకాంత్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, రాజా రవీంద్ర.. ఉన్నారు. నేడు కూడా కొందరు దర్శకులు, నిర్మాతలు, సెలెబ్రిటీలు చిరంజీవిని కలిశారు.

మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ సాయంత్రం చిరంజీవిని కలిశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఆయన వెంట ఉన్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు నామినేట్ అయినందుకు అభినందించారు. అంతకుముందే- యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్‌ను కలిశారు.
పనిలో పనిగా చిరంజీవికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ వినిపించి ఉండొచ్చనే టాక్ బయటికొచ్చింది. ఓ సింగిల్ లైన్ స్టోరీ చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు.
ప్రస్తుతం చిరంజీవి.. తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications