పెళ్లైన రెండు నెలలకే భర్తకు షాకిచ్చిన కీర్తి సురేష్..!

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.

మొత్తానికి గోవాలో డిసెంబర్ 12న ప్రేమించిన ప్రియుడుని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది.మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, తర్వాత తన భర్త ఆంటోని సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ భర్తకు లిప్‌లాక్‌ ఇచ్చింది.

trolls on Keerthy Suresh looks

ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది. ఈ ఏడాది కీర్తి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. అయితే గతేడాది చివర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో కీర్తి సురేశ్‌కు నిరాశ తప్పలేదు. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్లు తాళిబొట్టుతో కనిపించింది కీర్తి సురేష్.

మోడ్ర‌న్ డ్రెస్‌లో క‌నిపించిన కీర్తి త‌న తాళిబొట్టును ప్ర‌ద‌ర్శించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది.కీర్తి సురేష్ మోడ్ర‌న్ అమ్మాయే అయినా ఇలా తాళిబొట్టును గౌర‌వించ‌డాన్ని చాలామంది ప్ర‌శంసించారు.అయితే ఇప్పుడు మెడలో తాళిబొట్టుతో కనిపించకుండా అమ్మడు దర్శనం ఇచ్చింది. ఈ మధ్య భర్తతో కలిసి చేసిన ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫొటోల్లో కీర్తి మెడలో తాళిబొట్టు లేకుండ కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలలకే మెడలో తాళిబొట్టు బరువైందా అంటూ కీర్తి సురేష్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి విమర్శకుల చేస్తోన్న ట్రోల్స్‌పై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+