'వార్2' బొమ్మ అదిరింది: 5కు 4 ఇచ్చిన ఉమైర్ సంధు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ వార్2 చిత్రాన్ని నిర్మించింది. కియారా అద్వానీ హీరోయిన్. ఆదిత్య చోప్రా నిర్మించి ఈ సినిమాపై ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తన అభిప్రాయాన్ని తెలియజేయడంతోపాటు రేటింగ్ కూడా ఇచ్చాడు. సెన్సార్ సందర్భంగా తాను ఈ సినిమాను చూసినట్లు సంధు వెల్లడించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ స్పైథ్రిల్లర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను నీకిస్తాను అని ఆదిత్యచోప్రా చెప్పడంవల్లే వార్2 చేసినట్లు ముందస్తు విడుదల వేడుకలో తారక్ చెప్పారు.
అన్ని కోణాల్లో ప్రతిభను బయటపెట్టాడు
ఉమైర్ సంధు వార్2కు సంబంధించిన రివ్యూను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. తారక్, హృతిక్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని, పోటాపోటీగా డ్యాన్స్ వేశారు. వారిద్దరి మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలనే కాకుండా డ్యాన్స్ ను కూడా అద్భుతంగా తీశారు. వార్ 2కు యాక్షన్ సీన్లతోపాటు డ్యాన్స్ కూడా ప్లస్ పాయింట్ గా మారుతోంది. ఈ సినిమా ద్వారా నేరుగా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న జూనియర్ ఎన్టీఆర్ తనలో ఉన్న అద్భుతమైన ప్రతిభను అన్ని కోణాల్లో బయటపెట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడు. అందుకే ఈ సినిమాకు తాను 5కు 4 పాయింట్లు ఇస్తున్నట్లు ఉమైర్ సంధు పేర్కొన్నారు.

సెలవుల సందర్భంగా మంచి ఎంపిక
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వచ్చే సెలవుల్లో ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తారని, వారికి మంచి ఎంపిక అవుతుందన్నారు. సంధు గతంలో చాలా సినిమాలకు రివ్యూలిచ్చారు. చాలావరకు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే మరికొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఉమైర్ సంధును ఎలా నమ్మాలని తారక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ నుంచి ఈ రివ్యూలిస్తుంటాడు. సినిమా చూసుంటాడా? నమ్మకమేనా? సినిమా ఆడుతుందా? నమ్మొచ్చా? అంటూ నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications