సమంత నెంబర్ ను బ్లాక్ చేసిన ఉపాసన?
సినీ పరిశ్రమ అంటేనే చాలా చిత్రమైన పరిశ్రమ. ఇక్కడ జరిగే వింతలు, విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉండేవారంతా తారలే కాబట్టి. మెగా కోడలు ఉపాసనకి సినిమాల గురించి పెద్దగా తెలియదు . ప్రజాసేవ, వ్యాపారం.. ఈ రెండే తెలుసు. రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న తర్వాత చిరంజీవి ఇంటికి కోడలిగా వచ్చింది.
అలాగే స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్ ల నుంచి కాస్తంత విరామం తీసుకుంది. మయోసైటిస్ తో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల దగ్గర నుంచి తాను తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగిచ్చేసింది. ఆగస్టు 15న అమెరికాలో జరిగిన వేడులకు ముఖ్యఅతిథిగా హాజరైంది. ఆ తర్వాత ఇటలీ.. ఇలా పలు దేశాలు తిరిగొచ్చింది.

పెళ్లి తర్వాత రామ్ చరణ్ ని రొమాంటిక్ సీన్స్ లో, లిప్ లాక్ సీన్స్ లో నటించొద్దు అని ఉపాసన కండిషన్ పెట్టిందట. చరణ్ కూడా అదే ఫాలో అయ్యాడు. అయితే రంగస్థలం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ ఉపాసన మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పర్మిషన్ లేకుండానే సుకుమార్ సమంత ని డైరెక్ట్ గా చరణ్ కి వెళ్లి ముద్దు పెట్టే విధంగా సన్నివేశం రాశాడు . ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్ . చరణ్ మూడు రోజుల సెట్ కి వెళ్ళలేదు. అంతేకాదు మంచి మంచి స్నేహితులైన ఉపాసన - సమంతల మధ్య ఈ సీన్ చిచ్చు పెట్టింది. ఈ సన్నివేశం తర్వాత సమంత నెంబరును ఉపాసన బ్లాక్ చేసింది. నెలరోజులు మాట్లాడలేదంట. తర్వాత మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications