Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది?

మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పెను తుఫాను రాబోతోంది.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,బాలీవుడ్ ఎనర్జీ బాంబ్ రణవీర్ సింగ్ మూడోసారి ముఖాముఖి తలపడబోతున్నారు.ఈ ఇద్దరు స్టార్ల మధ్య గతంలో జరిగిన పోరు ఒక ఎత్తు అయితే,ఇప్పుడు జరగబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్'వర్సెస్ 'ధురందర్ 2'యుద్ధం మరో ఎత్తు.

సినిమా ప్రియులకు ఇది నిజంగా పండగే.హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం 'ఉస్తాద్ భగత్ సింగ్'అదే సమయంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురందర్ 2' ఒకే రోజు థియేటర్లలోకి రానున్నాయి.ఈ ఇద్దరు స్టార్లు తలపడటం ఇది మొదటిసారి కాదు,ఇది వారి మధ్య జరుగుతున్న'హ్యాట్రిక్'బాక్సాఫీస్ ఫేస్-ఆఫ్.

Ustaad Bhagat Singh vs Dhurandhar 2 Will Pawan Kalyan Break Ranveer Singh s Winning Streak March 19th a big day

ఎవరు పైచేయి సాధించారు?

గత రెండు సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్,రణవీర్ సింగ్‌లు ఒకే రోజు తమ సినిమాలను విడుదల చేశారు.కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఆ రెండు సార్లు ఫలితం రణవీర్ వైపే మొగ్గు చూపింది.తొలిసారిగా 2011లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం 'పంజా',రణవీర్ సింగ్ నటించిన 'లేడీస్ వర్సెస్ రికీ బెల్' ఒకే రోజు విడుదలయ్యాయి. 'పంజా' యావరేజ్‌గా నిలవగా,రణవీర్ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇక 2023లో పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' (Bro),రణవీర్ నటించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' ఒకే సమయంలో థియేటర్లలోకి వచ్చాయి.రణవీర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా,పవన్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

ఈసారి యుద్ధం ఎందుకు స్పెషల్?

గతంలో వీరిద్దరి సినిమాలు వేర్వేరు ఆడియన్స్‌ను టార్గెట్ చేశాయి.ఒకటి మాస్,మరొకటి క్లాస్/రొమాంటిక్.కానీ ఈసారి పరిస్థితి వేరు.' ఉస్తాద్ భగత్ సింగ్'పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ కాగా, 'ధురందర్ 2' కూడా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా.అంటే ఇద్దరూ ఒకే రకమైన'యాక్షన్' జోనర్‌లో తలపడబోతున్నారు.

సినిమాల స్పెషల్ అప్‌డేట్స్:

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విషయానికొస్తే...'గబ్బర్ సింగ్'కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ వేస్తే థియేటర్లలో పూనకాలే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ఇక దురంధర్-2 భారీ బడ్జెట్ యాక్షన్ సీక్వెల్. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడం, రణవీర్ సింగ్ మేకోవర్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గత రెండు సార్లు రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద విజయం రుచి చూశారు. కానీ ఈసారి పవర్ స్టార్ 'ఉస్తాద్' రూపంలో తన పాత రికార్డులను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ మూడో ముఖాముఖిలో రణవీర్ హ్యాట్రిక్ కొడతారా? లేక పవర్ స్టార్ తన పవరేంటో చూపిస్తారా? అన్నది మార్చి 19న తేలిపోనుంది. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, ఫ్యాన్స్‌కు మాత్రం ఈ 'స్టార్ వార్' అసలైన కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+