వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల వెడ్డింగ్ కార్డు; పెళ్లి అక్కడే.. ఎప్పుడంటే!!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది. మెగా హీరో వరుణ్ తేజ్, హీరో లావణ్య త్రిపాఠి లు గత కొంతకాలంగా ప్రేమించుకుని, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్థ వేడుక కూడా హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

త్వరలో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరగబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. వీరి వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ కార్డ్ విషయానికి వస్తే ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలను కార్డు పైభాగంలో ముద్రించారు.

Varun Tej, Lavanya Tripathi Wedding Card; these are the wedding details!!

వెడ్డింగ్ కార్డు లోపల వరుణ్ నానమ్మ తాతయ్య పేర్లు అయిన అంజనాదేవి, దివంగత కొణిదెల వెంకట్రావు పేర్లను ముద్రించారు. అలాగే వారి పేర్ల కింద చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను ముద్రించి అందరి బ్లెస్సింగ్స్ తో పెళ్లి చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. చాలా అందంగా తయారు చేసిన ఈ వెడ్డింగ్ కార్డులో వరుణ్ తేజ లావణ్య త్రిపాఠిలు నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో ఒక్కటి కాబోతున్నట్టు పేర్కొన్నారు.

అక్టోబర్ 30వ తేదీ నుండి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని, అక్టోబర్ 27వ తేదీన మెగా ఫ్యామిలీ ఇటలీకి బయలుదేరనుందని సమాచారం. నవంబర్ 5వ తేదీన నిర్వహించే రిసెప్షన్ ను మాత్రం ఘనంగా హైదరాబాద్లోనే జరుపుకోనున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగనుంది.

Varun Tej, Lavanya Tripathi Wedding Card; these are the wedding details!!

మెగా ఇంట పెళ్లి సందడి మొదలు కావడంతో ఈ పెళ్లిని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు? పెళ్లిలో ఎవరు ఎంత హడావిడి చేస్తారు? వారు పెళ్ళికి ఎంత కాస్ట్ లీ బట్టలు ధరిస్తారు? ఎవరు ఎలా వస్తారు? ఎవరెవర్ని పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు? అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+