భార్యకు హీరో విజయ్ విడాకులు..? స్పెషల్ ఫ్లైట్‌లో త్రిషతో గోవాకు జంప్

గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టిన రోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. ఈక్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన విషయం తెలిసిందే.

పైగా విజయ్ ఇచ్చిన బర్త్ డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ వినిపించింది. ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటం సాంగ్‌లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్‌లో నటించారామె. తొలుత ఈ సాంగ్‌లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్‌గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష, విజయ్ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్‌గా కూడా ఈ సాంగ్ వరస్ట్‌గా ఉందని సినీ అభిమానులు పెదవి విరిచారు. విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటం సాంగ్‌లో నటించడం జరిగింది.

Vijay and Sangeetha divorce rumours viral

ఇదిలా ఉంటే తాజాగా విజయ్, త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వీరిద్దరు స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లినట్టు తెలుస్తోంది.హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరవ్వడానికే వీరిద్దరు వెళ్లినట్టు సమాచారం. అయితే ఇప్పటికి వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యం, ఈ జంట మరోసారి కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈక్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భార్య సంగీత ఎక్కడ కనిపించలేదు. గతంలో విజయ్ ఎప్పుడూ తన భార్యతో కలిసి ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలో నైనా సరే సింగిల్‌గానే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని.. వీరు విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు.హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి, హీరోయిన్ త్రిషను త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+