టాప్ ప్లేస్‌లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్.. వెనకపడ్డ బన్నీ, చెర్రీ
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సెప్టెంబరు నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలు, హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళంలో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్న విజయ్ మొదటి స్థానంలో నిలవగా, హీరోయిన్ల జాబితాలో సమంత ప్రథమస్థానాన్ని అలంకరించింది. ప్రతి నెల అత్యంత ప్రజాదరణ పొందిన సినీ సెలబ్రిటీల జాబితాను ఆర్మాక్స్ ప్రకటిస్తుంటుంది. ప్రభాస్ వరుసగా మొదటి స్థానంలోనే నిలుస్తుండగా, విజయ్ గోట్ సినిమాతోపాటు రాజకీయాల్లోకి రానుండటంతో ఈ నెలకు ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండటంతో విజయ్ గురించి నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు. సమంత ఏ సినిమా చేయనప్పటికీ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. దీంతో ఆమె ప్రథమస్థానానికి వచ్చారు. మొత్తం వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో తమ హీరో ఏ స్థానంలో ఉన్నాడా అనుకూంట అభిమానులు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.

ఆర్మాక్స్ ప్రకటించిన జాబితా ప్రకారం 1.విజయ్, 2.ప్రభాస్, 3.షారుక్ ఖాన్, 4.అజిత్ కుమార్, 5.ఎన్టీఆర్, 6.అల్లు అర్జున్, 7.మహేశ్‌బాబు, 8.అక్షయ్ కుమార్, 9.రామ్ చరణ్, 10.సల్మాన్ ఖాన్.. హీరోయిన్లలో 1.సమంత, 2.అలియా భట్, 3.దీపికా పదుకొణె, 4.నయనతార, 5.త్రిష, 6.శ్రద్ధాకపూర్, 7.కాజల్ అగర్వాల్, 8.సాయిపల్లవి, 9.రష్మిక, 10.కియారా అడ్వాణి ఆయా స్థానాల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications