అందరి ముందే రష్మికకు ముద్దు పెట్టిన విజయ్.. వీడియో వైరల్ !
నేషనల్ క్రష్‌గా పేరు పొందింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్స్‌తో శరవేగంగా దూసుకుపోతుంది. నాగశౌర్యతో చేసిన 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను పెంచుకుంది. ఆ క్రమంలోనే హిందీ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. రణబీర్ కపూర్‌తో 'యానిమల్', విక్కీ కౌశల్‌తో 'ఛావా' వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అయితే సల్మాన్ ఖాన్‌తో చేసిన 'సికందర్' మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.
ఇక ఇటీవల విడుదలైన ఆమె 'కుబేరా', 'థామా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. భాషతో సంబంధం లేకుండా నెలకు ఒక కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సుందరి.. లేటెస్ట్ గానే 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించగా నవంబర్ 7న విడుదల అయ్యింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోగా.. సినిమాలో రష్మిక నటనకు సర్వత్రా ప్రశంసలు వెలలివెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య ఆతిధిగా హాజరయ్యారు.

అయితే టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన జంట అంటే విజయ్ దేవరకొండ - రష్మిక అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నరాని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్ గానే అతికొద్ది మంది సన్నిహితుల మధ్యలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్టు ప్రచారం నడిచింది. త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని చర్చ నడుస్తోంది. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి మాత్రం స్పందించకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఎట్టకేలకు వీళ్ల లవ్ ను పబ్లిక్ గా బయటపెట్టారు ఈ జంట.
మొత్తానికి ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ వేదికగా వీరిద్దరి ప్రేమకు సంబంధించిన ఓ దృశ్యం అభిమానుల కంటపడింది. తన కాబోయే భార్య రష్మిక మందన్న కోసం విజయ్ దేవరకొండ అందరి ముందే ముద్దు పెట్టుకున్నారు. వెంటనే రష్మిక సిగ్గుతో బ్లష్ అవుతూ ముఖం దాచుకుంది. దీంతో డైరెక్ట్‌గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications