'కింగ్‌డమ్'కు అండగా జగన్ ఫ్యాన్స్...పవన్ కల్యాణ్ రికార్డు బద్దలు
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' జులై 31న(గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కింగ్‌డమ్' విడుదల కోసం విజయ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, భారీ చిత్రాల మధ్య ఈ విడుదల దేవరకొండకు పెద్ద సవాలుగా నిలవనుంది. బాక్సాఫీస్ వద్ద ఏ చిన్న తేడా వచ్చినా అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
నిర్మాత నాగవంశీ, హీరో దేవరకొండ 'కింగ్‌డమ్' కంటెంట్‌పై గట్టి నమ్మకంతో ఉన్నారు. తిరుమల వెంకన్న దయ, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే బ్లాక్‌బస్టర్ కొట్టి టాప్‌లోకి వస్తానని దేవరకొండ ధీమాగా ఉన్నాడు. ట్రైలర్ లాంచ్‌లో అతని ఆత్మవిశ్వాసం, ట్రైలర్‌లోని హై కంటెంట్ ఈ నమ్మకాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా, గతంలో బాయ్‌కాట్ 'HHVM' అంటూ రచ్చ చేసిన వైసీపీ అభిమానులు ఇప్పుడు 'బ్లాక్‌బస్టర్ కింగ్‌డమ్' నినాదాన్ని అందుకుని దేవరకొండకు మద్దతు పలకడం ఆసక్తికరం.

విడుదలకు ముందే కింగ్‌డమ్ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఈ సినిమా బ్రేక్ చేసింది. వర్సీస్ లోనూ కింగ్డమ్ మూవీకి ఊహించని బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో కొద్దిరోజుల క్రితమే ఓపెన్ చేశారు. దీనికి అక్కడి ఆడియన్స్ నుండి కేవలం ప్రీమియర్ షోస్ కే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తుంది.
ఓవర్సీస్ లో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి రెండు లక్షల 40 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో రౌడీ బాయ్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.హరిహర వీరమల్లుకి ఓవర్సీస్ లోనూ ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ సేల్ అవ్వలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ దీన్ని అవమానంగా భావిస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే, ఎలాంటి మద్దతు ఉన్నా, సినిమాలో కంటెంట్ లేకపోతే ఎంత ప్రమోట్ చేసినా 'వీరమల్లు'కి పట్టిన గతే పడుతుంది. ట్రైలర్‌లోనే కథను చెప్పేయడం ఇప్పుడు అసలు సవాలుగా మారింది. కథ తెలిసిపోయిన తర్వాత, సినిమా ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులు, కొత్తదనంతో అలరించాలి. రొటీన్ సీన్లు, గ్రిప్ లేని కథనంతో ఈ రోజుల్లో జనం థియేటర్లకు రావడం లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బలమైన కంటెంట్ 'కింగ్‌డమ్'లో ఉండాలి.
ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ వస్తే, మొదటి రోజు, మొదటి వీకెండ్ వసూళ్లకు ఉత్సాహం పెరుగుతుంది. అదే సమయంలో, నెగెటివ్ టాక్ వస్తే దాని ప్రభావం కూడా అంతే దారుణంగా ఉంటుందనేది మర్చిపోకూడదు. మరి 'కింగ్‌డమ్' సినిమాతో మన రౌడీ హీరో కింగ్ అవుతాడో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications