విజయ్ దేవరకొండ సుడి తిరిగింది... ఆ స్టార్ డైరెక్టర్‌తో మూవీ

విజయ్ దేవరకొండ... ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ ఎవడే సుబ్రమణ్యం సినిమాలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది. వాస్తవానికి ఈ సినిమా అల్లు అర్జున్ చేయాల్సి ఉంది. అతను తిరస్కరిస్తే సందీప్ విజయ్ తో చేసి స్టార్ గా మార్చేశాడు. విజయ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్ల సరసన ఉండాల్సినవాడుకానీ అతడిని దురదృష్టం వెంటాడుతుండటంతో టైర్2 హీరోగానే మిగిలిపోయాడు.

సుకుమార్ తో లేనట్లే
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. సితార బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది. గీత గోవిందం ముందు, తర్వాత అన్నీ ఫ్లాప్ సినిమాలే చేశాడు విజయ్. లైగర్ సినిమా అయితే అతని కెరీర్ ను దారుణంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇటీవలే వచ్చిన ఫ్యామిలీస్టార్ కూడా ఫ్లాప్ అయింది. సుకుమార్ తో ఓ సినిమా ప్రకటించారుకానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. పుష్ప2 తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమా తీయబోతుండటంతో ఈ కాంబోలో సినిమా లేనట్లే అని అర్థమవుతోంది.

Vijay Deverakonda to do a film with Trivikram Srinivas

త్రివిక్రమ్ తో సినిమాకు విజయ్ పచ్చజెండా
తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులకు శుభవార్త. ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు.. త్రివిక్రమ్ శ్రీనివాస్. వాస్తవానికి పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా తీయాలి. దీనిపై స్పష్టత రావడంలేదు. తాజాగా ఇప్పుడు మరోవార్త వచ్చింది. విజయ్ దేవరకొండతో సినిమా తీయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయి సంవత్సరం అవుతోంది. ఇంతవరకు కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టలేదు త్రివిక్రమ్. అలాగే మీడియా ముందుకు కూడా రావడంలేదు. ఇటీవల రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చారు. త్రివిక్రమ్ చెప్పిన కథకు విజయ్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం కచ్చితంగా హిట్ అవడం ఖాయమని విజయ్ అభిమానులు అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడే నిర్మాతలెవరు, హీరోయిన్ ఎవరు అనేది తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+