విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!
తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఇటీవల పలు కారణాలతో ట్రెండింగ్ అవుతున్నారు. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగత కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జన నాయగన్ మూవీ నిరవధిక వాయిదా.. ఇప్పుడు తన మాజీ భార్య సంగీత వ్యవహారం.. ఇలా వరుస సమస్యలు ఆయన్ను చుట్టు ముట్టాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ కు ఇవి సానుకూలంగా మారుతాయా..? లేక ప్రతికూలంగా మారుతాయా..? అనేది తెలియాల్సి ఉంది.
ఇక కొన్ని రోజుల క్రితమే విజయ్ భార్య సంగీత.. అతడి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన భర్త విజయ్.. ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని.. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాదం కొనసాగుతున్న వేళ విజయ్, నటి త్రిష ఒకే కారులో ఇటీవల ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. చెన్నైలోని ఓ వివాహ కార్యక్రమానికి వీళ్లిద్దరూ జంటగా ఒకే కారులో రావడ.. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం జరిగింది.
అయితే ఇక విజయ్.. త్రిషను పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం రేపుతోంది. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కోర్టు నుంచి ఫైనల్ తీర్పు వెలువడేంత వరకూ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అలా చేస్తే అది చట్ట రిత్యా నేరం అవుతుంది. అందుకు కోర్టు తీర్పు వెలువడేంత వరకూ వేచి చూడనున్నట్లు సమాచారం. మరోవైపు సంగీతతో విడిపోయేందుకు విజయ్ చర్చలు జరిపాడని ఈ మేరకు ఆమెకు రూ. 250 కోట్లు భరణం కూడా ఇచ్చినట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అయింది. అయితే దీనిపై క్లారిటీ లేదు. అయితే విజయ్- సంగీతల వివాదం ఇప్పట్లో తేలేదా లేదు.

ఇక విజయ్ మాత్రం ఎన్నికలకు ముందే త్రిష ను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి త్రిషతో విజయ్ పెళ్లితో .. అతడి రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ అవుతుందా.. లేక మైనస్ అవుతుందా అనేది చూడాలి. మరోవైపు త్రిష.. టీవీకే పార్టీ తరఫున ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పినట్టుగా విజయ్- త్రిష కూడా అలాగే తమిళనాట చక్రం తిప్పాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక విజయ్- త్రిష జోడీగా ఐదు సినిమాలు వచ్చాయి. అందులో 'గిల్లి', 'తిరుపాచి', 'లియో' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications