విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ఇదే..! గూస్ బంప్స్ గ్యారంటీ..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్- ప్లాఫ్ టాక్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గతేడాది కింగ్డమ్ మూవీతో వచ్చినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు 'రణబలి' అనే శక్తివంతమైన టైటిల్ ను పెట్టినట్లు సమాచారం. దీనిపై జనవరి 26 న క్లారిటీ రానుంది. ఎందుకంటే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మూవీ టైటిల్ 'రణబలి' అని వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
భారత్ కు స్వాతంత్ర్యం రాకముందు రాయలసీమ ప్రాంతంలో పరిస్థితులు, కరవు, వలసలు, జానపద కథలు, తిరుగుబాటు భావాలు లాంటి పలు అంశాల మేళవింపుతో ఈ కథను దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.

ఇక ఈ మూవీతో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అదే 'రౌడీ జనార్దన'.. ఇటీవల ఈ మూవీకి సంబంధించి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. గ్లింప్స్ చూస్తే విజయ్ ఇప్పటివరకు టచ్ చేయని జానర్ లో ఇది తెరకెక్కుతుందని అర్థమవుతోంది. 'కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీలు' అనే డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రాయలసీమలోని కలింగపట్నం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications