విశ్వక్ సేన్‌కు మరో షాక్..ఓటీటీలోకి లైలా..?
యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం లైలా.రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ చేయడంతో లైలాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌తో వైసీపీ క్యాడర్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు, నటుడు పృథ్వీ సైతం వైసీపీకి క్షమాపణలు చెప్పడం జరిగింది.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రాజకీయ వివాదాల నడుమ లైలా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.అయితే సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కథ లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కథ, కథనం రెండూ బాలేదని సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పాతతరం కథ , అర్థంలేని హస్యం, ఆకర్షణ లేని సినిమాగా లైలా నిరాశపరిచిందని సినిమాపై ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

ఇదే సమయంలో లైలా సినిమాకు కలెక్షన్లు సైతం పేలవంగానే ఉన్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాకు అనుకున్నంతస్థాయిలో జరగలేదు.సినిమాకు ఒకరోజు ముందు అంటే గురువారం వరకు కేవలం 8 వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఈ సినిమా రెండు రోజులకు కలిపి కోటిన్నర వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
ఓవరాల్‌గా డీసెంట్ మార్కెట్ ఉన్న విశ్వక్ సేన్‌కి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. దాస్ క ధమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. మెకానిక్ రాకీ నిరాశ కలిగించగా ఇప్పుడు లైలా మూవీ , ఆ సినిమా కన్నా దారుణమైన ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్‌ను చూస్తుంటే ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చేలా కనిపిస్తోంది.
కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే రావడంతో ఈ సినిమాని ఓటిటిలోకి త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ మూవీని త్వరగా ఓటీటీలోకి తీసుకురావంతో మూవీ క్రేజ్ కొంతవరకు ఉంటుందని ఇక్కడ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లైలా యూనిట్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలోనే లైలా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications