Cult First Review: విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఊచకోతే..!
ప్రస్తుతం హిట్ కోసం పరితపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ లాంటి సినిమాలతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విశ్వక్ సేన్. ఆ తర్వాత హిట్ ది ఫస్ట్ కేస్ మూవీతో అటు థ్రిల్లర్ మూవీతోనూ హిట్ కొట్టారు. ఇక పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం లాంటి సినిమాలతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఫంకీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందు లైలా మూవీ కూడా ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ 'కల్ట్'..
కల్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విశ్వక్ సేన్ దర్శకత్వం చేయడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. గతంలో ఆయన ఫలక్ నుమాదాస్, దాస్ కా ధమ్కీ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. ఆ రెండు సినిమాలూ కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కల్ట్ అనే మూవీతో వస్తున్నారు. ఇండియాలోనే తెరకెక్కిన తొలి స్లాషర్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా నటించారు. అలాగే తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనేరుధ్ భాస్కర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీని తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మించారు.

కల్ట్ మూవీ అక్టోబర్ 30 న గ్రాండ్ రిలీజ్ సందర్భంగా ప్రివ్యూ షో ను రీసెంట్ గా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో వేసినట్లు సమాచారం. అయితే ఇక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. కల్ట్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టే విధంగా ఉండదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని స్క్విడ్ గేమ్స్ అనే పాపులర్ వెబ్ సిరీస్ ను ఆదర్శంగా తీసుకుని ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ తో కథను డిజైన్ చేసిన తీరు అద్భుతం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ అందించిన మాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మూవీని విశ్వక్ సేన్ నడిపించారని మాట్లాడుకుంటున్నారు. కల్ట్ మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి ఫుల్ రివ్యూ కోసం అక్టోబర్ 30 వరకూ అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే అన్నమాట..












Click it and Unblock the Notifications
