స్పై-యూనివర్స్ చరిత్రలో అత్యంత చెత్త ఓపెనింగ్!
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల స్పై-యూనివర్స్ సినిమా 'వార్-2' గురువారం థియేటర్లలోకి వచ్చింది. 2019లో వచ్చిన 'వార్' సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ ఏడాదిలోని అతిపెద్ద హిందీ సినిమాగా నిలిచింది. కానీ దాని సీక్వెల్ అయిన 'వార్-2' మాత్రం తొలిరోజు అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది.
'చావా' కంటే తక్కువ
'వార్-2' టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాని ఫలితం తొలిరోజు వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం.. 'వార్-2' మొదటి రోజు కేవలం రూ.52.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇందులో హిందీ వెర్షన్ కేవలం రూ.29 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. తెలుగు వెర్షన్ రూ.23 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో విక్కీ కౌషల్ నటించిన 'చావా' సినిమా తొలిరోజు రూ.33 కోట్లు వసూలు చేయగా.. 'వార్-2' హిందీ వెర్షన్ అంతకంటే తక్కువగా వసూలు చేయడం గమనార్హం.

స్పై-యూనివర్స్‌లోనే అతి తక్కువ ఓపెనింగ్
*'ఏక్ థా టైగర్' (2012): రూ. 33 కోట్లు
*'టైగర్ జిందా హై' (2017): రూ. 34 కోట్లు
*'వార్' (2019): రూ. 51.60 కోట్లు (హిందీ)
*'పఠాన్' (2023): రూ. 55 కోట్లు (హిందీ)
*'టైగర్ 3' (2023): రూ. 43 కోట్లు (హిందీ)
ఈ జాబితాలో 'వార్-2' హిందీ వెర్షన్ కేవలం రూ.29 కోట్లు వసూలు చేసి స్పై-యూనివర్స్‌లో అత్యంత తక్కువ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
తెలుగు ప్రేక్షకుల మద్దతు
'వార్-2' సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీనికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజే. గత స్పై-యూనివర్స్ సినిమాలు తెలుగు వెర్షన్‌లో రూ. 2 కోట్లకు తక్కువగా వసూలు చేస్తే, 'వార్ 2' ఏకంగా రూ. 23 కోట్ల ఓపెనింగ్ వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకుల మద్దతు ఉన్నప్పటికీ, హిందీలో వసూళ్లు తక్కువగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెనుకబడింది. ఈ చిత్రం వీకెండ్‌లో వసూళ్లు పెంచుకుంటుందని ఆశిస్తున్నారు. కానీ సోమవారం నుంచి కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications