బుల్లిరాజా మాజాకా.. ఈ ఏడాది ఏకంగా 10 సినిమాల్లో..
చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కొడుగ్గా బుల్లిరాజు అదరగొట్టాడు. తొలి సినిమా అయినా ఏమాత్రం భయం లేకుండా తన యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో ఈ పిల్లాడికి అవకాశాలు భారీగా వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలోనూ బుల్లిరాజు కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. బుల్లిరాజు కామెడీకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటున్నారు.
బుల్లిరాజు అసలు పేరు రేవంత్. ఐదో తరగతి చదువుతున్నాడు. ఏపీ నెల్లూరు జిల్లా చానమిల్లికి చెందిన ఈ పిల్లాడు.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వల్ల వైరల్ అయ్యాడు. దాంతో అతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నారు. అలా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు పాత్రలో అదరగొట్టాడు రేవంత్. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ చేయడంతో రేవంత్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇక సంక్రాంతి కానుకగా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ మూవీలోనూ రేవంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలోనూ రేవంత్ కామెడీ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయి. అయితే ఈ కుర్రాడు ఈ సంవత్సరం ఏకంగా పది సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్న వయసులోనే ఇంత బిజీగా ఉండటం నిజంగా గ్రేట్ కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఇటీవల సినిమా ప్రొమోషన్స్ లో రేవంత్ మాట్లాడుతూ.. తన కెరీర్ కు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నాడు. అన్ని సినిమాల్లో ఒకే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండాలని డైట్ చేస్తున్నట్లు తెలిపాడు. అందుకే సన్నబడ్డానని అన్నాడు. అంతేకాక ఈ ఏడాది 10 సినిమాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. చిరంజీవి సినిమాలో నటించడం తన జీవితంలో సంబరపడిన సందర్భం అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications