గుండె గట్టిదైతేనే ఈ సినిమా చూడండి.. ఓటీటీలోకి ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్..
తరాలు మారినా హారర్ థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రతిక్షణం ఏం జరుగుతుందా.. అని ఉత్కంఠ నెలకొనేలా ఉండే హారర్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. ఇటీవల రిలీజైన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు జాక్ క్రెగ్గర్ రూపొందించిన ఈ కొత్త హారర్ చిత్రం ఆడియన్స్ కు థ్రిల్ పంచింది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాను సుమారు రూ.335 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఈ మూవీ 23.5 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.2 వేల కోట్లు వసూలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

జాక్ క్రెగ్గర్ నిర్మించి.. అలాగే దర్శకత్వం చేసిన ఈ చిత్రంలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, ఆస్టిన్ అబ్రమ్స్, క్యారీ క్రిస్టోఫర్, టోబి హస్, బెనెడిక్ట్ వాంగ్, అమీ మాడిగాన్ కీలక పాత్రల్లో మెరిశారు. హర్రర్, థ్రిల్లర్, వయలెన్స్ సినిమాలు ఇష్టపడే వారు, థియేటర్‌లో మిస్ అయినవాళ్లు తప్పక చూడాల్సిన మూవీ ఇది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 7.8 రేటింగ్ ఉంది.












Click it and Unblock the Notifications