ఆ ఒక్కటి చిరంజీవి జీవితంపై మాయని మచ్చ... దానివెనక ఉన్నదెవరు?
మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాలుగా నిరంతరాయంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు పయనిస్తున్నారు. మధ్యలో కొంతకాలం రాజకీయాల్లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవిని అనుభవించారు. తన మనస్తత్వానికి అవి సరిపడవని భావించి తిరిగి వెనక్కి వచ్చేశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా విశ్వంభర చిత్రం చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీత దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానరుపై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ఇది.
కావాలనే ఉదయ్ కిరణ్ ను తొక్కేశారని
తన కెరీర్ లో ఎక్కడా చిన్న మచ్చ లేకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తోన్న చిరంజీవిపై ఒక సంఘటన మాత్రం బురద జల్లింది. అదేమిటంటే.. ఉదయ్ కిరణ్ ను తన పెద్ద అల్లుడిగా చేసుకుంటానని చెప్పి చేసుకోకపోవడం. అనివార్య కారణాలతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఉదయ్ కిరణ్ కు కెరీర్ లేకుండా పోయింది. చేసిన సినిమాలు కూడా సరిగా ఆడలేదు. వాస్తవానికి చిరంజీవి కావాలనే ఉదయ్ కిరణ్ కెరీర్ ను దెబ్బతీశారని, తొక్కేశారంటూ పరిశ్రమలో వార్తలు వచ్చాయి. కొన్ని సంవత్సరాలపాటు ఇలా చిరంజీవిపై ఈ సంఘటన మాయనిమచ్చలా నిలిచిపోయింది. అయితే చిరంజీవి అసలు ఉదయ్ కిరణ్ సినిమాల విషయంలో జోక్యం చేసుకోలేదు. ఏ నిర్మాత, దర్శకుడితో మాట్లాడలేదు.

తప్పించాలంటూ ఏనాడూ చెప్పలేదు
ఉదయ్ కిరణ్ కెరీర్ ను తొక్కేయలేదని ఎన్నోసార్లు చిరంజీవి చెప్పారు. తర్వాత ఉదయ్ కిరణ్ సోదరి కూడా అదే విషయంపై చాలాసార్లు మాట్లాడింది. ఉదయ్ కెరీర్ దెబ్బతినడం వెనక చిరంజీవి ప్రమేయం ఏమీలేదని స్పష్టం చేసింది. ఆమె చెప్పినప్పటికీ అప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి ఉదయ్ కిరణ్ ను ఎందుకు తప్పించారని కొందరు ప్రశ్నించారు.
చిరంజీవి కుమార్తెను అతను పెళ్లిచేసుకోవడంలేదు కాబట్టి మెగా అభిమానులు అతని సినిమాలను చూడరు.. కలెక్షన్లు రావు అనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు తమ సినిమాల నుంచి ఉదయ్ కిరణ్ ను తప్పించారు. అంతేకానీ సినిమాల నుంచి అతన్ని తొలగించాలంటూ చిరంజీవి నుంచి ఎటువంటి ఒత్తిడి రాలేదని ఇప్పటికీ సినీ పెద్దలు కొందరు చెబుతుంటారు. అయినా ఈ విషయంలో చిరంజీవికి చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇలా చిరుకు బ్యాడ్ నేమ్ రావడంవెనక కొందరు సినీ పెద్దలు ఉన్నారంటారు. వారెవరనేది, వారిపేర్లు మాత్రం బయటకు రాలేదు.












Click it and Unblock the Notifications