రామ్ చరణ్ పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసుకోబోతోంది. ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. తర్వాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాను చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ రావడంతో వేగంగా సినిమాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో రామ్ చరణ్ ఉన్నాడు.
కొన్నాళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మీడియాకు ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోయిన్లలో మీ క్రష్ ఎవరంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దాంతో కాస్త సిగ్గుపడ్డ చెర్రీ హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు. అంతే కాదు ఆన్ స్క్రీన్ లో జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్ అని, ఆమెను టీవీలో చూసినా, బిగ్ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతానన్నారు. అంతగా ఆమె నన్ను ఆకర్షిస్తుంది అన్నారు రామ్ చరణ్.

బప్రెట్టీ ఉమెన్ సినిమా చూశాక, ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెబుతూనే తన మరో క్రష్ గురించి కూడా బయటపెట్టాడు చరణ్. మరో హాలీవుడ్ నటి కేథరిన్ జెటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె సినిమాల్లో తాను మొదట చూసింది ది మార్క్ ఆఫ్ జోరో అని, ఆ మువీలో కేథరిన్ నటన ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications