ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లో అసలైన మాస్ హీరో ఎవరు?
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి హీరో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటాడు. అందుకోసమే కష్టపడుతుంటాడు. ఎందుకంటే ఒకసారి మాస్ హీరోగా గుర్తింపు సాధించగలిగితే కెరీర్ కు తిరుగుండదు. ఏ సెంటర్లలో ఎక్కువగా క్లాస్ అనుకున్నా.. బీ, సీ సెంటర్లలో పక్కా మాస్ ప్రేక్షకులకు సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. సినిమా బాగుందంటే చాలు.. రెండుసార్లు.. మూడుసార్లు చూస్తుంటారు. కలెక్షన్లను విపరీతంగా కొల్లగొట్టొచ్చు. రెండు, మూడు సినిమాలు ఫ్లాపైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బీసీ సెంటర్లలో అనుకున్నస్థాయిలో కలెక్షన్లు వచ్చేస్తుంటాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోరు.
బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల నీరాజనాలు
ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వీరిలో అసలైన మాస్ హీరో ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. కెరీర్ ప్రారంభంలో తారక్ ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని మాస్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదలతో పిలిపించుకుంటున్నాడు. బీ, సీ సెంటర్లలో తారక్ సినిమాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. దీంతో పవర్ ఫుల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

వీరిలో అసలు సిస్సలైన మాస్ హీరో ఎవరు?#PawanKalyan #NTR #RamCharan #Prabhas #MassHero
— oneindiatelugu (@oneindiatelugu) September 10, 2024
ఆర్ఆర్ఆర్ తో మాస్ జాతర చేశారు
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నాడు. పుష్ప1, పుష్ప2 ద్వారా మాస్ ఫాలోయింగ్ ను బాగా పెంచుకున్నాడు. ఈ సినిమాలకు ముందు క్లాస్ హీరోగా పరిశ్రమలోకి ప్రవేశించి కొంతకాలం క్లాస్ హీరోగానే కొనసాగాడు. క్రమేణా మాస్ హీరోగా మార్పు చెందాడు. అలాగే రామ్ చరణ్ చిరుత సినిమాద్వారా మాస్ హీరోగా అడుగుపెట్టారు. తర్వాత మగధీర పూర్తి విభిన్నమైన చిత్రం. దీంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. రంగస్థలం సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మాస్ జాతర చేశారని చెప్పొచ్చు. ఈ ముగ్గురు హీరోల్లో ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకొని ఇమేజన్ ను ఏర్పరుచుకున్నాడు. వీరి తర్వాత మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడంలో బన్నీ విజయవంతమయ్యాడు.












Click it and Unblock the Notifications