తెలుగులో నెం.1 హీరో ఎవరో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులు జాతీయస్థాయికి, అక్కడి నుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లగా, సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు దాన్ని అలాగే కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగుకన్నా హిందీ హీరో అయిపోయాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా చెలామణి అవుతున్నారు. దేశవ్యాప్తంగా వీరికి క్రేజ్ ఉంది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నాని, రవితేజ లాంటివారు తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. నాని మాత్రం ఇతర భాషల్లో కూడా తన సినిమాల విడుదల ఉండేలా చూసుకుంటున్నారు.
నిరంతరం చర్చ జరుగుతోంది
ఏ భాషలో లేనివిధంగా మన తెలుగులోనే ఎక్కువమంది స్టార్ హీరోలున్నారు. వీరిలో నెంబర్ 1 ఎవరు అనే చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెంబర్ వన్ అనేది సినిమా సినిమాకు మారిపోతోంది. ఒక హీరో సినిమా థియేటర్లలో రూ.500 కోట్లు రాబడితే, తర్వాత మరో హీరో సినిమా రూ.వెయ్యి కోట్లు రాబడుతోంది. ఆ తర్వాత మరో హీరో సినిమా రూ.1500 కోట్లు రాబడుతోంది. ఇలా హీరో క్రేజ్ అనేది థియేటర్లలో, దేశవ్యాప్తంగా వసూలయ్యే వసూళ్లనుబట్టి ఆధారపడివుంటుంది. సినిమా ఫ్లాప్ అయితే తర్వాత సినిమా మీద అంచనాలు ఉండటంలేదు.

ఎవరికి ఎక్కువ కలెక్షన్లు వస్తే వారే
స్టార్ హీరోల సినిమా అనే సంబంధం లేకుండా మీడియం రేంజ్, చిన్న సినిమా హీరోలు నటించిన సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొట్టి ఒక్కసారిగా వారిని స్టార్ హీరోలుగా మార్చేస్తున్నాయి. ఏ హీరో స్థానం ఒకే స్థానంలో ఉండటంలేదు. సినిమా సినిమాకు మారిపోతోంది. ఎవరైతే బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధిస్తారో వారే నెంబర్ వన్ గా నిలుస్తున్నారు. తర్వాత మరో హీరో సినిమా వచ్చి కొంచెం ఎక్కువ కలెక్షన్లు సాధించగానే అతను నెంబర్ వన్ హీరో అయిపోతున్నాడు. ఇలా పర్మినెంట్ గా నెంబర్ వన్ హీరో అని కాకుండా సినిమా సినిమాకు, వాటి కలెక్షన్ల ఆధారంగా నెంబర్ వన్ ఎవరనేది ఆధారపడుతోంది. సినిమాకు వచ్చే కలెక్షన్లే హీరోల స్థానాలను నిర్ణయిస్తున్నాయి.












Click it and Unblock the Notifications