పవన్ కల్యాణ్ మొదటి భార్యకు విడాకులు ఎందుకిచ్చారో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా పవన్ విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జనసేనతో పాటు, టీడీపీ , బీజేపీ కలిసి పోటీ చేశాయి. కూటమి విజయం సాధించడంతో పవన్‌కు కీలక పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా పవన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లాడారు. 1996లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు నందినిని పెళ్లి చేసుకున్నారు.. నందిని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి.నందినిని మొదటిసారి సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో పవన్ కలిశారు.

why Pawan Kalyan gave it to his first wife

ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సినిమా ప్రారంభమైన ఏడాది తర్వాత వీరిద్దరూ హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే నందిని, పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదు. వివాహం అయిన వెంటనే తన భార్య తననతో ఉండలేదని.. ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయిందని పవన్ ఆరోపించారు. కాని ఆమె ఈ ఆరోపణలు ఖండించింది. విడాకుల సమయంలో ఇద్దరు ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

విడాకుల సమయంలో మొదటి భార్య నందినికి 5 కోట్ల భరణం చెల్లించాడు. విడాకుల తర్వాత నందిని ఇండియాను వదలి శాశ్వతంగా అమెరికాకు వెళ్లిందని సమాచారం.నందినితో విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. రేణు దేశాయ్‌తో డేటింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఆమెను రెండో వివాహం చేసుకున్న పవన్..రేణు దేశాయ్‌తో ఇద్దర్ని పిల్లల్ని కన్నాడు. రేణు దేశాయ్‌తో వైవాహిక జీవితంలో ఉండగానే రష్యా అమ్మాయితో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌కు విడాకులిచ్చి అన్నా లెజ్నేవాను మూడో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దకి పిల్లలున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+