సాయి పల్లవి ఎందుకు బోల్డ్ దుస్తులు ధరించరు?: అసలు సీక్రెట్ ఇదే!
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా ఆమె ఎప్పుడూ బోల్డ్ దుస్తులకు దూరంగా ఉంటారు. కేవలం సాంప్రదాయమైన దుస్తుల్లోనే కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ చేదు అనుభవం ఉందని మీకు తెలుసా?
సాయి పల్లవి సినిమాల్లోకి రాక ముందు జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆమె దుస్తుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపింది. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ విషయాన్ని పంచుకున్నారు.
సాయి పల్లవి కాలేజీ రోజుల్లో ఓ డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. ఆ డ్యాన్స్ 'ట్యాంగో'శైలికి సంబంధించింది. ఆ డ్యాన్స్ కోసం ఆమె ఒక స్లిట్ ఉన్న (కొంచెం బోల్డ్ లుక్ ఉన్న) డ్రెస్ ధరించారు. సాయిపల్లవి ఆ డ్యాన్స్ కోసం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశారు. అయితే ఆ డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయినప్పుడు, కొందరు వ్యక్తులు ఆమె ప్రతిభను చూడకుండా, ఆమె ధరించిన దుస్తులపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఆ వీడియోను కొందరు పాజ్ చేస్తూ చూస్తూ, ఆమె శరీర భాగాలపై ఫోకస్ చేయడం సాయి పల్లవిని తీవ్రంగా కలిచివేసింది. "నన్ను ఒక వస్తువులా చూస్తున్నారని నాకు అనిపించింది. నేను పడ్డ కష్టం కంటే నా దుస్తులనే జనం చూస్తున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాల్లోనూ అదే నిబంధన
ఆ చేదు అనుభవం తర్వాత సాయి పల్లవి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పొట్టి దుస్తులు, రివీలింగ్ అవుట్‌ఫిట్స్ ధరించకూడదని నిశ్చయించుకున్నారు."ప్రజలు నా అందాన్ని చూసి కాదు, నా నటనను చూసి నన్ను గుర్తించాలి. నేను ఎలా ఉంటానో అలాగే సాదాసీదాగా కనిపించాలనుకుంటున్నాను" అని ఆమె చెబుతుంటారు.
మేకప్‌కు కూడా దూరం
సాయి పల్లవి కేవలం దుస్తుల విషయంలోనే కాదు, మేకప్ విషయంలో కూడా చాలా సహజంగా ఉంటారు. సినిమాల్లో తన ముఖంపై ఉన్న మొటిమలను కూడా దాచడానికి ఆమె ఇష్టపడరు. కృత్రిమ అందం కంటే తన సహజమైన చర్మంపైనే ఆమెకు నమ్మకం ఎక్కువ.
-
ఈ ఇద్దరు కలిసి వస్తే థియేటర్లు తగలబడడమే.. కొత్త మూవీ టీజర్ రిలీజ్ !! -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !!












Click it and Unblock the Notifications